ఆడవారి పెర్ఫ్యూమ్‌కు మోడల్‌గా సూపర్ స్టార్
లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ 'ఛానెల్ నెం.5' అనే మహిళల పరిమళానికి మొదటి సారి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గాను సంతకం చేశారు. ఈ 'ఛానెల్ నెం.5' అనే మహిళల పరిమళానికి సైన్ చేసిన మొదటి మగ మోడల్ బ్రాడ్ పిట్ కావడం విశేషం. ఈ ఆన్ లైన్ కథనం ప్రకారం ఈ మహిళల పరిమళానికి చెందిన మొదటి క్యాంపెయిన్ ఈ వారంలో చేయనున్నారని సమాచారం.
48 సంవత్సరాల వయసు కలిగిన బ్రాడ్ పిట్ ఇటీవలే ఎడ్వర్టైజ్ మెంట్స్ లో నటించినందుకు గాను ఏడు డిజిట్స్ కలిగిన పారితోషకాన్ని తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఇదే పారితోషకాన్ని తీసుకోనున్నట్లు బ్రాడ్ పిట్ అధికార ప్రతినిధి తెలిపారు.
గత ఏడు సంవత్సరాలుగా కలిసి సహా జీవనం సాగిస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ త్వరలో వివాహాం చేసుకోనున్నారు. అందరూ అనుకుంటున్నట్లే వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. గత ఏడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ శనివారం నిశ్చితార్దం జరిగినట్లు అధికారకంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











