ఈ సంవత్సరం కూడా అదే సక్సెస్: సూపర్ స్టార్
గత 12 నెలలుగా వరుస విజయాలతో విజయపధంలో దూసుకు పోతున్న హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్.. ఇదే జోరు ఈ సంవత్సరం కూడా ఉంటుందని తాను భావిచడం లేదని స్పష్టం చేశారు. 48 సంవత్సరాలు వయసు కలిగిన బ్రాడ్‌పిట్ నటించిన రెండు సినిమాలు 'మనీబాల్', 'ది ట్రీ ఆఫ్ లైఫ్' సినిమాలు స్ట్రింగ్స్ అవార్డ్స్‌కి నామినేట్ అయ్యాయి. హీరోలకు అవార్డులు అనేవి ఒక గుర్తింపుగా ఉంటాయే కానీ.. వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదని అన్నారు. కొన్ని సందర్బాలలో మనం ఎంత కష్టపడినా మన నటనకు అవార్డులు రావు.. అటువంటి సందర్బాలలో మనం బాధ పడాల్సిన అవసరం లేదన్నారు.
చివరి విజయం లేదా చివరి వైఫల్యం సొంతం చేసుకునేందుకు గాను ప్రతి ఒక్కరం కష్టపడుతూనే ఉంటామన్నారు. మనం ఎప్పుడైనా ఒక అవార్డుని సొంతం చేసుకున్నామంటే దాని వెనుక ఒక విన్నర్‌తో పాటు నలుగురు లూజర్స్ ఉంటారన్నారు. కానీ ఆ నలుగురు కూడా ప్రపంచం మెచ్చే సినిమాలు తీసి ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే బ్రాడ్‌పిట్ తన కూతురు 'వివిన్'ని ముద్దాడుతుండగా.. తప్పటడుగు వేయడంతో మోకాలు గాయపడడంతో ప్రస్తుతం కర్ర సహాయంతో వాకింగ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన '23వ ఫామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గాలా'కి రెడ్ కార్పెట్‌పైకి కర్రతో వచ్చి అక్కడున్న అందరిని ఆశ్చర్య పరిచారు.


Click it and Unblock the Notifications











