ఆ మృతదేహం కి రెండవ పోస్టుమార్టం వద్దు....!

By Nageswara Rao

పాప్ రంగానికి రారాజు మైఖేల్ జాక్సన్. మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద మృతి కేసు మరో ఆశక్తికర మలుపు తిరిగింది. మైఖేల్ జాక్సన్ మరణానికి అతని డాక్టర్ ముర్రే కారణం. గత ఏడాది జూన్ 25న తనకు నిద్రపట్టడం లేదని తన డాక్టర్ ముర్రేకు ఫోన్ చేసిన మైఖేల్ ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో వున్నాడట. ఫోన్ కాల్ తో హుటాహుటిన మైఖేల్ ఇంటికి చేరుకున్న ముర్రే తనకు నిద్రపట్టకపోవడానికి ఒత్తిడే ప్రధాన కారణం అని చెప్పి నిద్రరావడానికి ప్రొపొఫోల్ మందును ఇంజెక్షన్ చేసి బయటకు వెళ్లాడట. కానీ ఆ తర్వాత కూడా నిద్రపట్టని మైఖేల్ అక్కడే వున్న సిరంజీని తీసుకుని అధిక మోతాదులో ప్రొపొఫోల్ మందును ఇంజెక్ట్ చేసుకున్నాడని తిరిగి గదిలోకి వచ్చి చూసేసరికి మైఖేల్ నిర్జీవంగా పడివున్నాడని ముర్రే తరపు న్యాయవాది సరికొత్త వివాదానికి తెరలేపారు.

సంవత్సరం క్రితం చనిపోయిన ప్రపంచ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మృతదేహాన్ని పోస్టు మారటం నిమిత్తం మరో మారు బయటకు తీయనున్నారు. మైఖేల్ జాక్సన్ ను ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కాన్‌రాడ్ ముర్రే హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. లండన్ కోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ముర్రే తరపు న్యాయవాదులు తొలుత నిర్వహించిన పోస్టు మారటం రిపోర్టును తప్పు పడుతూ సవాల్ విసిరారు. జాక్సన్ మత్తును ఎక్కువగా తీసుకోవడం వల్లే మరణించినట్టు వచ్చిన ఆ రిపోర్టు తప్పని, డ్రగ్స్ ను మోతాదుకు మించి వినియోగించడం వల్లే అతను మరణించాడని వారు వాదించారు. దీనిఫై స్పష్టత రావాలంటే మరోసారి శవ పరీక్ష నిర్వహించాలని వారు వాదిస్తున్న నేపథ్యంలో కొత్త పరీక్షల కోసం జాక్సన్ భౌతిక కాయాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. అయితే జాక్సన్ శవాన్ని మరో సారి బయటకు తీసి పరీక్షలు నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు తమ వ్యతిరేకతను తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X