ప్రముఖ సింగర్ ఇంటికి పోలీసులు... కత్తులతో డ్యాన్స్ చేసినందుకే!

హాలీవుడ్ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ గురించి తెలియనివారుండరు. ఆమె తన గాత్రంతో కోట్లాదిమంది మనసులు గెలుచుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ భామ... ఈ మధ్య ఓ వీడియోను షేర్ చేసింది. అది చూసిన ఆమె సన్నిహితులు భయపడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. అసలు ఆ వీడియోలో ఏముంది... ఎందుకు సన్నిహితులు కంగారు పడ్డారు. .పోలీసులు ఎందుకు వచ్చారు అనే విషయాలను ఇందులో తెలుసుకుందాం.

పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలు ఎంత ఫేమసో తెలిసిందే. ఆమె పాటలతో ఎంతో మందిని ఉర్రూతలూగించింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... హాట్ హాట్ వీడియోలు, ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఓ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అది చూసిన నెటిజన్స్ తో పాటు అందరూ ఆందోళన చెందారు.

Singer Britney Spears

గాయని బ్రిట్నీ స్పియర్స్ తాజాగా కత్తులతో డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ పాప్ స్టార్ బికినీలో కత్తులతో చేసిన ఫీట్ల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది చూసిన ఆమె సన్నిహితులు, నెటిజన్స్ కంగారు పడ్డారు. ఆ కత్తులతో ఆమెకు గాయాలు అయ్యాయా అని భయపడ్డారు. దీనితో ఆమె సన్నిహితులు పోలీసులను ఆశ్రయించారు.

 Britney Spears Home After Popstar Disturbing Video of Dancing With Knives

ఈ వీడియో చూసిన పోలీసులు సైతం కంగారు పడ్డారు. ఆమెకు ఏమైనా గాయాలు అయ్యాయా అని... వైద్యులతో చెక్ అప్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రిట్నీ స్పియర్స్ కి ఎలాంటి ముప్పు లేదని తెలుసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఆమె సన్నిహితులకు తెలియజేశారు. ఇక ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెంది కంప్లైంట్ ఇచ్చిన వారి పేరును పోలీసులు వెల్లడించలేదు.

కొంతమంది లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు చెందిన మానసిక ఆరోగ్య బృందానికి కాల్ చేశారు. ఆ తర్వాత బ్రిట్ని ఇంటికి వెళ్లిన అధికారులు అసలు విషయం తెలుసుకున్నారు. ఈ విషయంపై బ్రిట్నిని పోలీసులు అడిగారు. ఇక ఆమె ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చింది. తాను క్షేమంగా ఉన్నానని... ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించింది.

బ్రిట్ని స్పియర్ ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకువచ్చింది "నేను గత పోస్ట్‌తో అందరినీ భయపెట్టానని నాకు తెలుసు, అయితే ఇవి నిజమైన కత్తులు కావు... అవి అద్దెకు తీసుకున్న కత్తులు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నా అభిమాన ఆర్టిస్టులలో ఒకరైన షకీరాను అనుకరించటానికి ప్రయత్నించాను.. నాకు అది స్ఫూర్తినిచ్చిన ప్రదర్శన. అందుకే అలా చేశాను. ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పుకువచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X