బాత్‌టబ్‌లో నగ్నంగా మడోన్నా.. కరోనా ముప్పుపై వేదాంతం.. (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రముఖులు, సామాన్య ప్రజలనే తేడా లేకుండా ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు రావొచ్చో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ శృంగారతార మడోన్నా నగ్నంగా బాత్‌టబ్‌లో కూర్చొని వేదాంతం ఒలకబోసింది. ఇంతకు కరోనాపై మడోన్నా ఏం చెప్పిందంటే..

పూలరెక్కలు నింపిన బాత్‌టబ్‌లో
కోవిడ్ 19ను గురించి పూలరెక్కలు నింపిన బాత్‌టబ్‌లో కూర్చొని మడోన్నా ఏం చెప్పారంటే.. కరోనా మహమ్మారి ఎంత భయంకరమంటే.. నీవు సంపన్నుడివా? లేదా నీవు ప్రముఖుడివా? నీవు ఎంత ఫన్నీగా ఉంటావో అనే విషయాన్ని పట్టించుకోదు. నీవు ఎంత అందగత్తెవు? నీవు ఎక్కడ నివసిస్తున్నావు అనే విషయాలను దానికి అనవసరం అని వీడియోలో చెప్పింది.

సమానంగానే కరోనా కాటు
ఇక నీవు ఎంత గొప్పగా కథలు చెబుతావు. నీవు ఎంత అద్భుతమైన వ్యక్తివైనా సరే కరోనా కాటుకు బలి కావాల్సిందే. ప్రతీ ఒక్కరిని సమానా దృష్టితోనే కాటు వేస్తుంది. ధనిక, పేద, సెలబ్రిటీవా అనే వ్యత్యాసాలు దానికి లేవు. ప్రయాణించే నావ మునకలా ఏదో ఒకరాత్రి మానవలోక చరిత్ర ముగిసిపోతుందనే చెబుతూనే ఉంటాను గుర్తుందిగా అని మడోనా పేర్కొన్నారు.

అందాల ఆరబోతతో
కరోనాపై జీవిత వేదాంతం చెబుతూనే వీడియోలో అందాల ఆరబోతను యదేచ్ఛగా సాగించింది. తన ఛాతిపై రెండు పూలరెక్కలను పెట్టుకొని హాట్‌హాట్‌గా కనిపించింది. చివరకు ఆ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ కరోనాకు వివక్ష లేదు. స్వీయ గృహనిర్బంధమే శ్రీరామరక్ష.. ఇంటిలోనే సురక్షితంగా ఉండండి అంటూ వీడియోలో చెప్పింది.

వరుసగా రెండో వీడియో
ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో మడోన్నా విడుదల చేసిన రెండో వీడియో ఇది. శుక్రవారం ఆహార కొరత, సోషల్ డిస్టాన్సింగ్‌పై ఓ చిలిపి వీడియోను విడుదల చేసింది. ఆ తర్వాత తాజాగా హాట్ హాట్ అందాలతో కరోనాకు దయాదాక్షిణ్యాలు ఉండవని పేర్కొన్నది. ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసిన వీడియోను తొలగించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











