twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Singer Madonna: శృంగారానికి నేను బానిసను.. పెళ్లి చేసుకొని అంటూ పాపులర్ సింగ్ హాట్ కామెంట్స్

    |

    అమెరికన్​ గాయనీ, గేయ రచయిత మడోన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పించంది హాలీవుడ్​ పాప్ సింగర్​ మడోన్నా. ఇప్పటికీ తన 64 ఏళ్ల వయసులో కూడా సింగర్​గా రాణిస్తోంది మడోన్నా. తన గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటిఫుల్ సింగర్. సింగింగ్​ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్​ యాక్టివ్​గా ఉండే మడోన్నా.. తన లైంగిక జీవితం, వివాహ బంధం గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

    అద్భుతమైన గాత్రంతో..

    అద్భుతమైన గాత్రంతో..

    అమెరికన్​ సింగర్​, లిరిక్​ రైటర్​ అయిన మడోన్నా తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే పలు ఫొటోలతో, వ్యాఖ్యలతో వివాదాలకు సైతం గురైంది. తాజాగా తన వివాహ సంబంధం, లైంగిక జీవితం గురించి ఓ యూట్యూబ్​ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తను శృంగారానికి బానిసైనట్లు తెలిపి అందరినీ షాక్​కు గురిచేసింది.

    పశ్చాతాపం..

    పశ్చాతాపం..

    లైంగిక జీవితానికి బానిసగా మారానని చెప్పిన పాప్ సింగర్​ మడోన్నా రెండు వివాహాలు చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్లుగా పేర్కొంది. అయితే ఈ ఇంటర్వ్యూలో 'మీ జీవితంలో తీసుకున్న ఏ నిర్ణయం సరైంది కాదు' అని మీరు భావిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు 'రెండు సార్లు పెళ్లి చేసుకోవడం' అని సమాధానం ఇచ్చింది మడోన్నా.

    రెండు వివాహాలు..

    రెండు వివాహాలు..

    అయితే రెండు వివాహాలు చేసుకోవడం పట్ల పశ్చాతాపం పడుతున్నా మడోన్నా, శృంగారానికి బానిసైనట్లు నిజాయతీగా ఒప్పుకుంది. కాగా సీన్​ పెన్ అనే వ్యక్తిని 1985లో పెళ్లి చేసుకున్న సింగర్ మడోన్నా.. 1989 వరకు కలిసి ఉంది. అనంతరం విడాకులు ఇచ్చి.. 2000 నుంచి 2008 వరకు గై రిట్చీతో వివాహ సంబంధం కొనసాగించింది.

    ఆరుగురు పిల్లలు..

    ఆరుగురు పిల్లలు..

    మొత్తంగా మడోన్నాకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అందులో సీన్​ పెన్​ ద్వారా కుమార్తె లూర్డ్​ కార్లోస్​ లియోన్ జన్మించగా, గై రిట్చితో రోకో అనే కుమారుడు ఉన్నాడు. వీరే కాకుండా కవల పిల్లలు అయిన ఎస్టెరే, స్టెల్లెలతోపాటు మెర్సీ, డేవిడ్​లను దత్తత తీసుకుని పోషిస్తోంది మడోన్నా. ​

     టీచర్​ అయ్యేదాన్ని..

    టీచర్​ అయ్యేదాన్ని..

    అలాగే తను 'సింగర్ కాకుంటే ఏం అయ్యేవారు' అని అడిగిన ప్రశ్నకు 'నేను సింగర్​ కాకుంటే ఒకవేళ టీచర్ అయ్యేదాన్ని' అని సమాధానం ఇచ్చింది మడోన్నా. ఇదిలా ఉంటే ఆ మధ్య సోషల్ మీడియాలో మడోన్నా ట్రాన్సర్పెంట్​ దుస్తుల్లో పెట్టిన పోస్ట్​లు దుమారం రేపాయి. అందుకు మగాళ్లు విప్పి చూపిస్తే తప్పు లేనప్పుడు, మహిళలు చేస్తే తప్పు వచ్చిందా అని వాటికి కౌంటర్​ కూడా వేసింది.

    English summary
    Hollywood Pop Singer Madonna Reveals She Regrets Being Married Twice And Obsessed With Sexual Life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X