Shakira పీకల్లోతు కష్టాలు..8 ఏళ్ల జైలు శిక్ష.. 194 కోట్ల ఫైన్

పన్ను ఎగవేత కేసులో గ్లోబల్ మ్యూజిక్ సెన్సేషన్ షకీరాకు ఎదురు దెబ్బ తగిలింది. షకీరాపై నమోదైన కేసు విచారించిన బార్సిలోనా కోర్టు భారీ జరిమానాతోపాటు 8 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఈ కేసులో విచారణ, తీర్పు విషయంలోకి వెళితే..

కొలంబియాకు చెందిన పాప్ స్టార్ షకీరా 2012 నుంచి 2014 వరకు 14.5 మిలియన్ పౌండ్స్ సంపాదించింది. ఈ మొత్తానికి స్పానిష్ ట్యాక్స్ ఆఫీస్‌లో చెల్లించలేదనే ఆరోపణలను అధికారులు చేశారు. దాంతో ఈ కేసు విచారించిన కోర్టు షకీరాకు 1,94,37,68,415 రూపాయల జరిమానాను విధించింది.

Pop Singer Shakira landed in legal trouble of Tax fraud

అయితే కోర్టు తీర్పుపై షకీరా స్పందించింది. ఈ పన్ను ఎగవేత వ్యవహారంలో తాను అమయాకురాలిని అని తన లాయర్ల ద్వారా వెల్లడించింది. తాను అమాయకురాలినని నిరూపించుకొంటాను అని షకీరా ప్రకటనలో తెలిపింది. పన్ను ఎగవేత వ్యవహారంలో తమ క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదు అని లాయర్లు తెలిపారు. ఈ మేరకు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

ది వాయిస్ టూర్ ద్వారా ఇంటర్నేషనల్ టూర్లలో పాల్గొన్నారు. వాటికి పన్ను చెల్లించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే అమెరికాలో ఆ కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరించారు. ఆ సమయంలో స్పెయిన్‌లో రెసిడెంట్గా లేరు. కాబట్టి పన్ను ఎగవేత వ్యవహారం ఆరోపణలతో ఆమెకు సంబంధం లేదు అని షకీరా తరఫు న్యాయవాదులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X