Moon Bin: యంగ్ సెన్సేషన్ మూన్‌బిన్ మృతి.. బెడ్‌రూంలో ఆ పరిస్థితిలో ఉండడంతో!
ఏదైనా ఒక రంగంలో పాపులర్ అవడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది తనదైన గాత్రం, స్టైల్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్నాడు యంగ్ సెన్సేషన్, సౌత్ కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్.
చాలా చిన్న వయసులోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్న ఈ యువ గాయకుడు తాజాగా కన్నుమూశాడు. బుధవారం రాత్రి తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూంలో విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని మూన్‌బిన్ సాంగ్స్‌ను రికార్డింగ్ చేసే కంపెనీ 'ఫాంటియాగో' ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది.

యంగ్ సెన్సేషనల్ పాప్ సింగర్ మూన్‌బిన్ బుధవారం రాత్రి సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆయన మేనేజర్ గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో వాళ్లు రంగ ప్రవేశం చేసి మూన్‌బిన్ మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్నారు. అంతేకాదు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం మూన్‌బిన్ పార్థివదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని సౌత్ కొరియన్ మీడియా ప్రచురించింది.
ఇక, 25 ఏళ్ల మూన్‌బిన్ మరణంపై 'ఫాంటియాగో' కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో 'మూన్‌బిన్ హఠాత్తుగా మనల్ని వదిలివెళ్లిపోయారు. వినీలాకాశంలో ధృవతారలా మారిపోయారు' అంటూ పేర్కొంది. దీంతో అతడి అభిమానులు, సన్నిహితులు దుఖ: సాగరంలో మునిగిపోయారు. మూన్‌బిన్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా అతడి కోట్ల మంది ఫాలోవర్లు పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మూన్‌బిన్ దక్షిణ కొరియాలోని చియోంగ్జులో జనవరి 26, 1998న జన్మించాడు. అతడు చిన్న వయసు నుంచే పాటలు, నటన, డ్యాన్స్‌లో రాణిస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే మరో ఐదుగురు గాయకులతో కలిసి ఫిబ్రవరి 23, 2016న K-పాప్ గ్రూప్ ASTROతో ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అప్పటి నుంచి తనదైన గాత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మూన్‌బిన్ సోదరి మూన్ సువా కూడా కే-పాప్ సింగరే. ఆమె గర్ల్స్ బ్యాండ్ బిల్లీలో సభ్యురాలిగా ఉంది.


Click it and Unblock the Notifications











