సెకండ్ 'పెర్ఫ్యూమ్'ని 2013లో విడుదల చేస్తా: మడోన్నా
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ పాప్ స్టార్ మడోన్నా 2013 సంవత్సరం చివరి కల్లా మార్కెట్లోకి రెండవ 'పెర్ఫ్యూమ్'ని విడుదల చేసేందుకు ప్రణాళికను రంగం సిద్దం చేసింది. దీని తర్వాత మడోన్నా మగవారికి సంబంధించిన పెర్ఫ్యూమ్‌ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం.
గత వారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మడోన్నా 'Truth or Dare' పేరుతో మొదటి 'పెర్ఫ్యూమ్'ని విడుదల చేసి.. రెండవ 'పెర్ఫ్యూమ్' పై పనిని ప్రారంభించింది. దీనితో పాటు మగవారికి సంబంధించిన సెంట్‌ని రూపొందించాలనేది తన కోరికగా ఈ కార్యక్రమంలో వెల్లిడించింది.
ఈ ఈవెంట్‌లో మడోన్నా మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో నేను రెండవ 'పెర్ఫ్యూమ్'ని విడుదల చేయనున్నానని చెప్పడం సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే మగవారికి కూడా సెంట్‌ని రూపొందిస్తున్నాను. దీనికి సంబంధించిన పనులను నా కూతురు దగ్గరుండి మరీ చూసుకుంటుంది. మగవారి 'పెర్ఫ్యూమ్' వాసన పీల్చేందుకు అచ్చం విస్కీ మాదిరి ఉంటుందని అన్నారు.
నా వరకు కస్తూరి, అంబర్ 'పెర్ఫ్యూమ్'ని ధరించిన మగవారంటే చాలా ఇష్టమని అన్నారు. నేను విస్కీ వాసనను ప్రేమిస్తున్నాను - మేము విస్కీ మాదిరి ఒక పురుషుల కాలోజ్నె తయారు చేయాలి. ఐతే విస్కీని నేను ఎప్పుడూ సేవించ లేదు. ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అని అన్నారు.


Click it and Unblock the Notifications











