ఇప్పటికీ నా శరీరాకృతి ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం ఇదే..
స్పైసీ గర్ల్ మరియు సింగర్ పోష్ తన అందం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడానికి కోన్ని కారణాలు వెల్లడించారు. పోష్ విక్టోరియా బెక్ హాం షోలో సూపర్ స్లెండర్ ఫిగర్ గాగుర్తింపు తెచ్చుకున్నారు. తన శరీరం ఒంపుసోంపులతో ఉండడానికిగాను ప్రతిరోజు తాను ఐదు మైల్స్ పరిగెత్తుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం ప్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నాంకాబట్టి మన శరీరాకృతి చాలా చక్కగా ఉండకపోతే ఈరంగంలో రాణించలేమని మన అమ్మడు చాలా తెలివిగా మాట్లాడుతుంది. పోష్ ఈసందర్బంలో మాట్లాడుతూ నాకు నచ్చినట్లే చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా త్వరలో జిమ్ కికూడా వెల్లనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రస్తుతం ట్రైనర్ అన్వేషణలో ఉన్నట్లు తాను చెప్పారు.


Click it and Unblock the Notifications











