ఎయిర్ పోర్ట్స్ లో అలా ప్రవర్తించడంలో ఆమెకు ఆమె సాటి..
పాప్ ప్రపంచానికి రారాజు మైఖెల్ జాక్సన్ తర్వాత పాప్ అభిమానులు ఎక్కువగా కలిగిన పాప్ స్ట్రార్ లేడిగాగా. ప్రస్తుతం లేడిగాగా పాప్ ప్రపంచంలో ఏమి చేసినా పెద్ద ప్యాషన్. విక్టోరియా బెక్ హామ్ లాంటి వారే దానిని ఒప్పుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. లేడిగాగా ఎప్పుడూ అభిమానులకోసమే పరితపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తను ఎప్పుడూ ఏదో కొత్తగా కనిపించాలనే తాపత్రయం గల మంచి సింగర్.
లేడిగాగా ఎప్పుడు కనిపించినగాని ఏదో ఒక కోత్త స్టయిల్ లోదర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా తాను స్టేజిపై దర్శనమిచ్చిందంటే యావత్ సంగీత ప్రపంచానికి ఎక్కడలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అలా తన పాప్ మ్యూజిక్ తోఅందరిని అలరిస్తుంది. అంతేకాకుండా తను ధరించేటటువంటి ప్రతి డిజైన్ చూడడానికి చాలా అందంగా ఉంటుదన్నారు. ఇక తను ధరించేటటువంటి హైహీల్స్ విషయానకి వస్తే వాటి వల్లే తన నడక చాలా బాగుంటుందని చెప్పాలి అన్నారు.
లేడిగాగా హైహీల్స్ వేసుకోని ఎయిర్ పోర్టులలో నడుస్తుంటే చాలా చక్కాగా ఉంటుందని అన్నారు. అందుకే నాకు లేడిగాగా అంటే చాలా గౌరవం కూడా అన్నారు. కోన్ని కోన్ని డ్రస్సులు ధరించి నాకు ఎయిర్ పోర్టుకి వెళ్శాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది, కాని లేడిగాగాకి అటువంటి సిగ్గులేదని అన్నారు. నిజాయితీగా చెప్పాలంటే లేడిగాగా తనకు తానే సాటి. తాను చేసేటటువంటి సాహాసాలు మరెవరూ చేయలేరని అన్నారు.


Click it and Unblock the Notifications











