వాచీ తెచ్చిన తంటా.. ఎయిర్‌పోర్టు అధికారుల అదుపులో సూపర్‌స్టార్!

హాలీవుడ్‌ సూపర్ స్టార్ అర్నాల్డ్ స్వార్జ్‌నెగర్‌కు మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. జర్మనీ పర్యటకు వచ్చిన ఆయనను ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకొన్నారు. అయితే ఆయనను అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..

అర్నాల్డ్ జనవరి 17వ తేదీన యూఎస్ నుంచి జర్మనికి వెళ్లారు. ఆయన తన చేతికి స్విస్ లగ్జరీ ఆడెమర్స్ పీగెట్ వాచీని ధరించారు. అయితే జర్మనీ అధికారులకు ఈ వాచీ గురించి ముందస్తు సమాచారం అందించకపోవడంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అడ్డగించారు.

Predator Fame Arnold Schwarzenegger detained in Munich Airport in Germany Trip

అయితే ఆస్ట్రీయాలో జరిగే వరల్డ్ క్లైమేట్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్ కోసం తన వాచీని వేలం వేసేందుకు నిర్ణయించుకొన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన అధికారులకు వెల్లడించలేదు. దాంతో ఈ వివాదానికి కారణమైంది. యూరోపియన్ యూనియన్ పరిధి తయారు కానీ ప్రొడక్ట్‌ను అనుమతించకూడదని అనే నిబంధన ఉంది. దాంతో నిబంధనను ఉల్లంఘించడంతో ఆయనను అదుపులోకి తీసుకొన్నాం.ఈ నిబంధన ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది. దానికి ట్యాక్స్ చెల్లించాలి అని అధికారులు తెలిపారు.

అయితే ఆ ట్యాక్సీని చెల్లించడానికి అర్నాల్డ్ సిద్దపడ్డారు. కానీ తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడానికి ప్రయత్నించారు. అయితే క్రెడిట్ కార్డు మిషన్ పనిచేయకపోవడం వల్ల గంట సేపు వెయిట్ చేయించారు. దాంతో ఆయనను ఏటీఎం వద్దకు తీసుకెళ్లి దాని నుంచి డబ్బు విత్ డ్రా చేసి ట్యాక్స్ చెల్లించే ప్రయత్నం చేశారు అని మీడియా తెలిపింది.

Predator Fame Arnold Schwarzenegger detained in Munich Airport in Germany Trip

అయితే అక్కడ చేదు అనుభవం మరోసారి ఎదురైంది. అయితే అక్కడ బ్యాంక్ క్లోజ్ చేసి ఉండటం, ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో ఆయన అసహనానికి గురి అయ్యాడు. ఆ తర్వాత అధికారి మరో క్రెడిట్ కార్డు మిషన్ తీసుకు రావడం దానిని నుంచి డబ్బులు చెల్లించడంతో ఈ తతంగం ముగిసింది. అయితే ఇదంతా పూర్తి కావడానికి 3 గంటల సమయం అర్నాల్డ్‌కు వృథా అయ్యింది. మూడు గంటల తర్వాత అర్నాల్డ్‌ను వదిలిపెట్టారు. అయితే తనకు జరిగిన అవమానంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే జర్మనీ ఇలా తగలబడిందని అర్నాల్డ్ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X