ఆత్మహాత్యలను నివారించడం కోసం హెల్ప్ లైన్ ప్రవేశపెట్టిన హీరోయిన్..
మిరంద కెర్ ఆస్ట్రేలియా మోడల్. విక్టోరియా సీక్రెట్ ఏంజల్స్ లో పోల్గోన్న మొట్టమొదటి ఆస్ట్రేలియా మోడల్. ఇటీవల మిరంద కెర్ వోగ్ ఇటాలియా పత్రకను కవర్ పేజిపై తన అందాలను ఆరబోసింది. మిరంద కెర్ వయసు 22 సంవత్సరాలు, ఈ 22సంవత్సరాల వయసుగల మోడల్ హాలీవుడ్ హీరో ఆర్నాల్డో బ్లూమ్ ని పెళ్శాడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సి ధరించిన విషయం అందరికి తెలిసిందే. మిరంద కెర్ బ్రా మోడల్ గామన అందరికి సుపరిచితమే.
అంతేకాకుండా 2009వ సంవత్సరంలో తన కుటుంబీకులలో ఒకరు కోన్ని అనివార్య కారణాల వల్ల ఆత్మహాత్య చేసుకోవడం జరిగింది. ఇక అప్పటినుండి మిరంద కెర్ తనదైన శైలిలో ఈఆత్మహాత్యలపై పోరాటం సాగిస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది యువకులు అనవసరంగా వారి ప్రాణాలను తీసుకుంటున్నారని వాపోయింది. ఎవరైనా యంగ్ స్టర్స్ కోన్ని కారణాల వల్ల ఇబ్బందులకు గురిఅయినట్లైతే అలాంటి వారిని ఆదుకునే విధంగా ఫోన్ ద్వారా వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చివరగా మనిషి భాదల్లో ఉన్నప్పుడు తనదైన శైలిని కోల్పోయి ఇలాంటి ఆత్మహాత్యలకు పాల్పడుతుంటారని అన్నారు. ఇలాంటి వారందరి కోసం సహాయం చేయాలని తన అభిమానులను సైతం తనకి తోడ్పాడుగా ఉండాలని అన్నారు.


Click it and Unblock the Notifications











