ప్రెగ్నెంట్ పద్మలక్ష్మి నగ్న ఫోజులు...!!

By Kuladeep

భారతదేశ మోడల్, ఆరు నెలల గర్భవతి అయిన పద్మలక్ష్మి అమెరికాలోని ఓ పత్రిక కవర్ పేజీకోసం నగ్నంగా ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోలో పద్మ, తన రెండు మోకాళ్లతో వక్షస్థలాన్ని కవర్ చేస్తూ కూచున్న భంగిమలో కుడివైపు భాగాన్ని చూపుతూ తీక్షణమైన చూపును విసురుతున్నట్లు ఫోజిచ్చింది. కవర్ పేజీపై ఇలా కనిపించిన పద్మలక్ష్మి పత్రిక లోపలి పేజీలలో మరింత స్వేచ్ఛగా నగ్న ప్రదర్శనను ఇచ్చినట్లు భోగట్టా.

నగ్నంగా కనబడటం కూడా ఒక కళ అనీ, తను ఈ నగ్న ఫోజువ్వడానికి చాలా కసరత్తు చేశానని పద్మలక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే జుగుప్స కలిగించే నగ్న ప్రదర్శనకు తను వ్యతిరేకమని అంటోంది. దుస్తులు లేకుండా నగ్న ఫోజు ఇవ్వడం నిజంగా ఓ ఛాలెంజ్ అని చెపుతోంది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించినప్పుడు అసలురూపం బయటపడుతుందనీ, ఆ రూపాన్ని చూపించే అవకాశం కొంతమందికే వస్తుందని ఎంతో సంతోషంగా చెప్పింది పద్మ.

39 ఏళ్ల పద్మలక్ష్మి, సల్మాన్ రష్దీని వివాహమాడి అటుపిమ్మట 2007లో అతడికి విడాకులిచ్చింది. ప్రస్తుతం తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పటానికి మాత్రం తల పంకిస్తోంది. కొత్తగా తను పత్రికకు ఇచ్చిన నగ్న ఫోజు సంచలనం సృష్టిస్తుందనీ, తద్వారా తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశపడుతోంది. కాగా ఈ పత్రిక డిసెంబరు 3న విడుదలయింది. మరిన్ని చిత్రాలకై ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X