టెస్టులు చేయించారు, బాయ్ ఫ్రెండు ద్వారా గర్భం!
కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ షకీరా గత కొంత కాలంగా పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు ఇప్పటికే ఒక బాబుకి జన్మినిచ్చారు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. ప్రస్తుతం బాబు వయసు 19 నెలలు.
తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్ ద్వారా షకీరా మళ్లీ గర్భం దాల్చింది. ఇద్దరూ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని షకీరా కూడా ధృవీకరించారు. తన కడుపులో ఉన్న బిడ్డ లింగ నిర్దారణ టెస్టులు కూడా చేయించారు. వీరికి మళ్లీ మగ బిడ్డ జన్మించబోతున్నాడు. తాము చాలా సంతోషంగా ఉన్నట్లు షకీరా చెప్పుకొచ్చింది.

గెరార్డ్ పిక్‌తో షకీరా 2010 నుండి సహజీవనం చేస్తోంది. షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... నాలుగేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా రెండు సార్లు గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 37 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











