Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మడోన్నా ట్రైనర్‌తో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్లో బొద్దుగా, ముద్దుగా ఉండే ప్రీతిజింతా త్వరలో అందుకు భిన్నంగా స్లిమ్‌గా హాలీవుడ్ నటిలా అగుపించనున్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రీతి 'ఇష్క్ ఇన్ పారిస్" చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల 'పిజడ్ఎన్జడ్" పేరిట ఆమె ఓ బేనర్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ బేనర్‌పై తొలి ప్రయత్నంగా ప్రేమ్ సోని దర్శకత్వంలో 'ఇష్క్ ఇన్ పారిస్" చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథానాయికగా తనే నటిస్తున్నారు. ఇందులో పారిస్‌కి చెందిన యువతిలా నటించబోతున్నారు.
ఇక్కడి ఫిట్నెస్ ట్రైనర్స్ అయితే కరెక్ట్‌గా ఉండదని అనుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి ఏకంగా హాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ 'ట్రేసీ ఆండర్సన్"ని నియమించుకున్నారట. హాలీవుడ్ తారలు మడోన్నా, గ్వినెత్ పాల్త్రో, షకీరా, జెన్నిఫర్ అనిస్టాన్, జెన్నిఫర్ లోపెజ్ తదితరులు ట్రేసీ దగ్గరే ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఐదు పదుల వయసులో ఉన్న మడోన్నాలో ఆ ఛాయలు కనిపించకపోవడానికి కారణం ట్రేసీ ఇచ్చిన శిక్షణే అని హాలీవుడ్ వర్గాలు అప్పుడుప్పుడు అనుకుంటుంటాయి.
మడోన్నాకి ఎలాంటి ఆహార నియమాలు చెప్పారో, ఏయే వ్యాయామాలు చేయించారో... ఆ పద్ధతినే ప్రీతీకి ఫాలో కాబోతున్నారట ట్రేసీ. కచ్చితంగా 12, 15 ఏళ్ల వయసు తగ్గినట్లుగా ప్రీతి కనిపిస్తారని, ట్రేసీ సామర్థ్యాలు అలాంటివని ఆమె గురించి తెలిసినవారు అంటున్నారు. ప్రస్తుతం ప్రీతికి 36 ఏళ్లు అట. ట్రేసీ ట్రైనింగ్‌తో 15ఏళ్ల వయసు తగ్గుతుందని అంటున్నారు కాబట్టి జస్ట్ 20, 21ఏళ్ల అమ్మాయిలా ఆమె అగుపిస్తారని ఊహించవచ్చు. కధను బట్టి 'ఫాబ్రైస్ లూచిని, కేథరిన్ డెన్యూవ్" అనే ఫ్రెంచ్ తారలను కీలక పాత్రలకు తీసుకోవడం జరిగింది.