twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒబామా పబ్లిక్ స్టేట్మెంట్: హీరోయిన్‌కు ఐ లవ్ యూ

    By Bojja Kumar
    |

    వాషింగ్టన్ డిసి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అమెరికా అత్యున్నత పౌర సత్కారం అందుకున్నారు. వైట్ హౌస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఒబామా ఈ అవార్డు అందజేసారు. ఈ సందర్భంగా ఆమెకు ‘ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' అందజేసారు.

    President Obama Honors Meryl Streep, Says I've said it publicly: I love Meryl Streep

    ఈ కార్యక్రమంలో ఒబామా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసారు. ‘నేను మెరిల్ స్ట్రీప్‌ను ప్రేమిస్తున్నాను' అంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమెకు అవార్డు అందజేయడానికి ముందు మెరిల్ స్ట్రీప్‌పై పొగడ్తల వర్షం కురిపించిన ఒబామా ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. ‘ఆమె భర్తకు కూడా తెలుసు నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని, అదే విధంగా నా భార్య మిచెల్లికి కూడా తెలుసు నేను ఆమెను ప్రేమిస్తున్నానని' అంటూ ఒబామా వ్యాఖ్యానించారు.

    ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ యూట్యూడులో కూడా అప్ లోడ్ అయింది. ఈ కార్యక్రమంలో మెరిల్ స్ట్రీప్ రెడ్ కలర్ డ్రెస్సులో రేడియంట్ లుక్ తో దర్శనమిచ్చింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు హాలీవుడ్ తారను ప్రమిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించడం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    English summary
    President Barack Obama presented the nation's highest civilian honor to Iron Lady actress Meryl Streep during a formal ceremony in the White House on Monday, Nov. 24, in Washington, D.C. Barack Obama honored the American actress with the Presidential Medal of Freedom. One of the fans of the talented Oscar-winning actress and confessed openly that he loves her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X