భాగస్వామి కనుగొనడం సులభం కాదు: ప్రిన్స్ హ్యారీ
27 సంవత్సరాల వయసు కలిగి బ్రిటిష్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ తన కాబోయే భార్య గురించి ఇప్పుడే అతిగా ఆలోచిస్తున్నారు. రాయల్ ఫ్యామిలీ మెంబర్‌గా కలసిపోయి ఆ బాధ్యతలను తీసుకునే అమ్మాయిని వెతకడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా అభివర్ణిస్తున్నాడు. ఇక ప్రిన్స్ హ్యారీ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల పాటు 'చెల్సియా డేవి' అనే యువతితో డేటింగ్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజలను దృష్టిలో పెట్టుకోని 2009లో విడిపోయారు.
రాకుమారుడిగా జీవించడం ఓ అధ్బుతం కదా అని ప్రశ్నించినప్పుడు అవును దీనిని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. కానీ నా అంతట నేను ఏ అమ్మాయికి కూడా ఇంత వరకు ప్రపోజ్ చెయ్యలేదని అన్నారు. ఎందుకంటే రాకుమారుడిగా అది నా పని అన్నారు. నా వైపు చూడండి. ప్రస్తుతం నా వయసు 27 సంవత్సరాలు. నా జీవితంలోకి ప్రవేశించి అమ్మాయి గురించి వెతికే వయసు నాకు లేదని అనుకుంటున్నాను.


Click it and Unblock the Notifications











