Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రయివేట్‌గా పాప్ సింగర్‌తో రొమాన్స్ చేస్తున్న 'ప్రిన్స్'
లండన్: బ్రటిష్ రాయల్ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ.. పాప్ స్టార్ మోలి కింగ్‌తో తనకున్న సంబంధాన్ని ప్రజా పరిశీలన యొక్క ఒత్తిడి దృష్ట్యా సీక్రెట్‌గా ఉంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. 27 సంవత్సరాల వయసు కలిగిన ప్రిన్స్ హ్యారీ గత కొంత కాలంగా పాప్ స్టార్ మోలి కింగ్ తో డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం పబ్లిక్‌లో లీక్ అవ్వకుండా ఉండేందుకు గాను కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే కలుసు కునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
గతంలో ప్రిన్స్ హ్యారీ అన్న విలియమ్, కేట్ మిడిల్టన్ మధ్య పెళ్లికి ముందు ఉన్న సంబంధం గురించి వివిధ పత్రికలు వార్తలను తెగ వ్రాసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ విలియమ్, కేట్ మిడిల్టన్ల ప్రేమ చూపులతో మొదలై చివరకు పెళ్లి వరకు వెళ్లింది. కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం కింగ్‌తో ఉన్న సంబంధం పత్రికల వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
పబ్లిక్ వీరిద్దరి మధ్య సంబంధం ఉందని తెలిస్తే అందరి నోళ్లలో నానడమే కాకుండా భవిష్యత్తులో కలుసుకోవడానికి కాస్త పడతారు. ఇలాంటి వాటన్నింటిని నుండి తప్పించుకునేందుకు గాను వీరికి ఎవరైతే బాగా నమ్మకస్తులుగా ఉన్న స్నేహితులు ఇంట్లో మాత్రమే కలుసుకుంటున్నట్లు సమాచారం. పాప్ సింగర్ మోలి కింగ్ స్నేహితురాలు జరా ఫిలిప్స్ ఇంట్లో వీరిద్దరూ ఆదివారం రహాస్యంగా కలుసుకున్నట్లు సమాచారం.