twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ సింగర్‌తో డేటింగ్‌కు సిద్దమైన రాజకుమారుడు..?

    By Nageswara Rao
    |

    బ్రిటిష్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ పాప్ స్టార్ కాటి పెర్రీ తో డేటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాటీ పెర్రీతో డేటింగ్ చేసేందుకు గాను క్వీన్ ఎలిజబెత్ యొక్క వజ్రోత్సవం కచేరీ కోసం 'ఫైర్ వర్క్' సింగర్ అయిన కాటీ పెర్రీని ఆహ్వానించనున్నాడని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధులు తెలిపినట్లు ప్రముఖ పత్రిక డైలీ న్యూస్ తెలిపింది.

    ప్రిన్స్ హ్యారీ కాటీ పెర్రీని ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకటి కాటీ పెర్రీ గ్రేటెస్ట్ సాంగ్స్‌తో అభిమానులను రాకింగ్ చేయడం. రెండవది సింగిల్‌గా జీవించడంతో పాటు సెక్సీగా ఉండడమే. క్వీన్ ఎలిజబెత్ యొక్క వజ్రోత్సవం కచేరీకి ఆహ్వానించినట్లు ఆహ్వానించి కాటీ పెర్రీతో సన్నిహితంగా మెలగవచ్చనే భావంతో ఉన్నట్లు సమాచారం.

    ఇది ఇలా ఉంటే ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటికీ అబ్బాయిలతో సాప్ట్‌గా మెలుగుతుంది. జూన్ 4న జరగనున్న క్వీన్ ఎలిజబెత్ వజ్రోత్సవం కచేరీలో ప్రిన్స్ హ్యారీ గానీ తన సోదరుడు విలియమ్ గానీ కాటీ పెర్రీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరని బకింగ్ హామ్ ప్యాలెస్ నిర్వాహాకులు వెల్లడించారు.

    English summary
    Prince Harry reportedly wants a date with pop star Katy Perry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X