Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూపర్ సింగర్‌తో డేటింగ్‌కు సిద్దమైన రాజకుమారుడు..?
బ్రిటిష్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ పాప్ స్టార్ కాటి పెర్రీ తో డేటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాటీ పెర్రీతో డేటింగ్ చేసేందుకు గాను క్వీన్ ఎలిజబెత్ యొక్క వజ్రోత్సవం కచేరీ కోసం 'ఫైర్ వర్క్' సింగర్ అయిన కాటీ పెర్రీని ఆహ్వానించనున్నాడని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధులు తెలిపినట్లు ప్రముఖ పత్రిక డైలీ న్యూస్ తెలిపింది.
ప్రిన్స్ హ్యారీ కాటీ పెర్రీని ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకటి కాటీ పెర్రీ గ్రేటెస్ట్ సాంగ్స్‌తో అభిమానులను రాకింగ్ చేయడం. రెండవది సింగిల్‌గా జీవించడంతో పాటు సెక్సీగా ఉండడమే. క్వీన్ ఎలిజబెత్ యొక్క వజ్రోత్సవం కచేరీకి ఆహ్వానించినట్లు ఆహ్వానించి కాటీ పెర్రీతో సన్నిహితంగా మెలగవచ్చనే భావంతో ఉన్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటికీ అబ్బాయిలతో సాప్ట్‌గా మెలుగుతుంది. జూన్ 4న జరగనున్న క్వీన్ ఎలిజబెత్ వజ్రోత్సవం కచేరీలో ప్రిన్స్ హ్యారీ గానీ తన సోదరుడు విలియమ్ గానీ కాటీ పెర్రీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరని బకింగ్ హామ్ ప్యాలెస్ నిర్వాహాకులు వెల్లడించారు.