ఎవరికి తెలియని ప్లేసులో మొదటి వివాహ వార్షికోత్సవం
ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ ఆదివారం నాడు మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ అధికార ప్రతినిధి ఈ వారంలో ధృవీకరించారు. విలియమ్, కేట్ ఇద్దరు కూడా వీరి వివాహ వార్షికోత్సవాన్ని ప్రయివేట్‌గా జరుపుకున్నారు. అంతేకాకుండా ఈ జంట వార్షికోత్సవం కోసం బ్రిటన్‌లో ఒక గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లి అక్కడ చేసుకున్నారు.
ఏప్రిల్ 29, 2011న జరిగిన విలియమ్స్, కేట్‌ల వివాహాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది చూశారని అంచనా. వైట్ డ్రెస్‌లో పెళ్లి కూతురు కేట్ మెరిసి పోయింది. ఈ పెళ్లికి సుమారు రూ.500 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. వీరి పెళ్లి కేవలం బ్రిటన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హడావుడి సృష్టించింది. లండన్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. నెలల ముందు నుండే ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా పలువురు అంతరిక్షం నుండి శుభాకాంక్షలు తెలిపారు.
పెళ్లి అనంతరం రహస్యంగా హనీమూన్‌ని సీషెల్స్ జరుపుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలసి సంయుక్తంగా మొదటి విదేశీ పర్యటనలో భాగంగా కెనడా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలను సందర్శించారు. ఆ తర్వాత విలియం ఎక్కువగా ఫాల్క్ ల్యాండ్స్‌లో ఉన్న రాయల్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ పైలట్ విధులను నిర్వహిస్తూ బిజీగా ఉండగా, కేట్ మిడిల్టన్ రాచఠీవితో వివిధ కార్యక్రమాలలో పాల్గోంటున్నారు.


Click it and Unblock the Notifications











