స్టార్‌వార్స్‌లో ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ.. విభిన్నమైన పాత్రల్లో..
బ్రిటీష్ యువరాజులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ కొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న స్టార్‌వార్స్ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించనున్నారు.
బ్రిటీష్ యువరాజులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ కొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న స్టార్‌వార్స్ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించనున్నారు. ఈ విషయాన్ని హాలీవుడ్ నటుడు జాన్ బయేగా ధ్రువీకరించారు. నిత్యం రాజరికం పనుల్లో బిజీగా ఉండే ఈ యువరాజులు సినిమాలో నటించనున్నారనే వార్త హాలీవుడ్ సంచలనం రేపింది. ఇంతకీ వారు పోషించే పాత్రలు ఏమిటంటే..

సైనిక పాత్రల్లో హ్యారీ, విలియమ్స్
స్టార్‌వార్స్: ది లాస్ట్ జెడీ చిత్రం శరవేగంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. సైంటిఫిక్, ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హ్యారీ, విలియమ్స్ శత్రుదేశాల సైన్యాన్ని అణిచివేసే సైనికుల పాత్రల్లో (స్ట్రామ్‌ట్రూపర్) కనిపించనునున్నారు. గత ఆగస్టు నుంచి మీడియాలో వైరల్‌గా మారిన గాసిప్స్ తాజా ప్రకటనతో వార్తగా మారింది.

విభిన్నమైన పాత్రల్లో
స్టార్‌వార్స్: ది లాస్ట్ జెడీ చిత్రంలో విలియమ్స్, హ్యారీ నటిస్తున్నారు. రాజవంశానికి చెందిన ఇద్దరు యువరాజులు విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తారు. వారిని సైనిక దుస్తుల్లో చూస్తే ముచ్చటేస్తున్నది అని నటుడు జాన్ బయేగా వెల్లడించారు.

నటించడం లేదు
ఇదిలా ఉండగా, గాయని, సినీ రచయిత గ్యారీ బర్లోవ్ ఈ సినిమాపై స్పందించారు. తాను స్టార్‌వార్స్: ది లాస్ట్ జెడీ చిత్రంలో నటించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని ఆమె స్పష్టం చేసింది.

డిసెంబర్ 13న విడుదల
స్టార్‌వార్స్: ది లాస్ట్ జెడీ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి రియాన్ జాన్సన్ స్క్రీన్ ప్లేను అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ విలియమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











