తెరకెక్కనున్న ప్రిన్సెస్ డయానా జీవితం...

By Nageswara Rao

బ్రిటిష్ రాయల్ ప్రిన్స్ డయానా జీవితం ఆధారంగా ఒక చలన చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత స్టీఫెన్ ఎవాన్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రిన్స్ డయానా పాత్రలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ నటించనుంది. డయానా అంగరక్షకుడు 'కెన్ వార్ఫే' యొక్క జ్ఞాపకాలను ఆధారం చేసుకోని రచించిన పుస్తకం 'డయానా: క్లోజిలీ గార్డెడ్ సీక్రెట్' ని ఆధారం చేసుకోని నిర్మించనునున్నట్లు తెలిపారు. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ రాణి అయిన డయానా ఆగస్టు 1997లో కారు యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే.

ఈ చిత్ర నిర్మాత స్టీఫెన్ ఎవాన్స్ మాట్లాడుతూ ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్న తర్వాత 11 సంవత్సరాల నుండి జరిగిన అన్ని సంఘటలను ఈ సినిమాలో ప్రముఖంగా చూపించనున్నామని అన్నారు. డయానా జీవితం జీవితం గురించి చాలా మంది ప్రజలకు తెలియని నిజాలను ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో డయానా అందంతో పాటు.. ఆమె మెడ నొప్పితో ఎలా బాధ పడిందో ఇందులో ప్రేక్షకులు వీక్షించవచ్చని అన్నారు.

ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు పొందిన అనంతరం కెన్సింగ్‌టన్ ప్యాలెస్‌లో కొత్త హంగులను సంతరించుకున్న తన పాత నివాసానికి డయానా చేరుకున్నారు. మృత్యువు ఒడిలోకి చేరుకునేంతవరకూ ఆమె ఆ నివాసంలోనే కొనసాగారు. అదేసమయంలో విడాకుల అనంతర జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేయాలన్న లక్ష్యంతో రెడ్ క్రాస్ సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకొనటమే కాక ప్రపంచమానవాళికి ముప్పుగా పరిణమించిన మందుపాతర్ల సంస్కృతికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి మందుపాతర్ల నివారణ పట్ల అంతర్జాతీయ సమాజంలో డయానా కొత్త ఆలోచనలను రేకెత్తించారు. ఈ నేపథ్యంలో వారి ప్రచారానికి మరియు జూడీ విలియమ్స్‌కు సంయుక్తంగా 1997వ సంవత్సరపు నోబుల్ శాంతి పురస్కారం లభించింది.

ఇదిలా ఉండగా మానవాళికే మహమ్మారిగా పరిణమించిన ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఒక ప్రతిష్ఠాత్మక వ్యక్తిగా ఆమె తీసుకున్న చొరవ యావత్‌ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1987వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చైన్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధి సోకిన వ్యక్తి చేయిని డయానా పట్టుకోవడం అంతర్జాతీయంగా సంచలనానికి దారితీసింది. ఆమె చూపిన మానవత్వం హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రజలలో గల అపోహలను కొంతమేరకు దూరం చేసిందని చెప్పవచ్చు. యుక్తవయసులో బ్రిటిష్ యువరాణికి దాదిగా పనిచేసిన 58 ఏళ్ల నానీ మేరీ క్లార్క్ మాట్లాడుతూ డయానా ఒక అద్భుతమైన వ్యక్తిగా వర్ణించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X