నాకు నిశ్చితార్దం అయి పోయిందోచ్..

By Nageswara Rao

'ప్రిన్సెస్ డైరీస్' సినిమా స్టార్ హీరోయిన్ 'అన్నే హాత్వే' తాను బాయ్ ప్రెండ్ 'ఆడమ్ సుల్మన్‌'తో ఎంగేజ్ అయ్యానని అధికారకంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే 29 సంవత్సరాల వయసు కలిగిన అన్నే హాత్వే చేతికి నిన్న బ్రూక్లెన్‌లో బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మన్ పెద్దల సమక్షంలో రింగ్ తొడగడం జరిగింది. ఆడమ్ సుల్మన్ హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ, జ్యూయలర్ డిజైనర్‌గా బాగా సుపరిచితం.

ఈ జంట నవంబర్ 2008 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో అన్నే హాత్వే మాట్లాడుతూ చాలా రోజులుగా మేము కలిసి ఉంటున్నప్పటికీ, సుల్మన్ నన్ను ఓ గర్ల్ ప్రెండ్‌లాగా చూడడం, నేనేమో తనని ఓ బాయ్ ప్రెండ్ లాగా మాత్రమే చూడడం జరిగేది. అలా చాలా రోజులు కలిసి తిరిగిన తర్వాత మాఇద్దరి అభిప్రాయలు ఒకటిగా ఉండడంతో మేము కలసి జీవించాలనే ఉద్దేశ్యంతో ఎంగేజ్‌మెంట్‌కి ఒప్పుకొవడం జరిగిందన్నారు.

సెప్టెంబర్ 2008కి ముందు అన్నే హాత్వే ఇటాలియన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ రఫ్ఫెలియో ఫోల్లొరితో ప్రేమాయణం నడపారు. రఫ్ఫెలియో ఫోల్లొరి ఫ్రాడ్ చార్జెస్ కేసులో అరెస్టు అవడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్షను ప్రభుత్వం ఖరారు చేసింది. దాంతో అప్పటి నుండి అన్నే హాత్వే అతనతో పూర్తిగా సంబంధాలను తెంచుకుంది. ఇక ప్రస్తుతం అన్నేహాత్వే బ్యాట్ మెన్ సినిమా 'ద డార్క్ నైట్ రైజెస్' లో నటిస్తున్నారు. ఇందులో హీరోగా క్రిస్టేన్ బేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, లీడ్ హీరోయిన్ రోల్‌ని అన్నేహాత్వే పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X