Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆస్కార్ బరిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఈ సారి గెలవడం కాయం..?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతగానో క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా మెల్లగా తన క్రేజ్ ని పెంచుకుంటోంది. హాలీవుడ్ మ్యాగజైన్లో ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం, వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించనున్న 93వ అకాడమీ అవార్డులలో తప్పకుండా ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే ఆమె ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకునే ఛాన్స్ ఉందట.
ప్రస్తుతం ఈ న్యూస్ హాలీవుడ్ మీడియాలో కూడా టాపిక్ గా మారింది. ఆస్కార్ రెడ్ కార్పెట్ లలో నడవనున్న హాట్ ఫేవరెట్ స్టార్స్ లలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒకరని ఇప్పటికే చాలా మీడియా ఛానెల్స్ దృవీకరించాయి. ప్రియాంక రాబోయే హాలీవుడ్ చిత్రం ది వైట్ టైగర్ లో అద్భుతమైన నటనతో ఆకట్టుకోబోతోందని ఆ సినిమా ద్వారానే ఆమెకు ఆస్కార్ రానుందట. అందులో ప్రియాంక నటన విమర్శకులతో పాటు జ్యూరీ సభ్యులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. వైట్ టైగర్ అనే సినిమా ప్రసిద్ధ భారతీయ రచయిత అరవింద్ అడిగా యొక్క పుస్తక ఆధారంగా తెరకెక్కింది.
ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రనిర్మాత రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాను నేరుగా OTT ప్లాట్‌ఫాంపై విడుదల చేయబోతున్నారు. ఇక ఆస్కార్ బరిలో ప్రియాంకతో పాటు మెరిల్ స్ట్రీప్ ( ది ప్రోమ్ ), హాన్ యెన్-రి (మినారి ), క్రిస్టిన్ స్కాట్ థామస్ (రెబెక్కా) ఒలివియా కోల్మన్ (ది ఫాదర్ ) వంటి వారు పోటీలో నిలవనున్నట్లు తెలుస్తోంది.