పెళ్లైనట్టు నమ్మకం కలగడం లేదు.. భర్తనా? బాయ్‌ఫ్రెండా? ప్రియాంక చోప్రా
భర్త నిక్ జోనస్ పేరు ఎత్తితే ప్రియాంక చోప్రా బుగ్గలు కందిపోతుంటాయి. పెళ్లి జరిగి ఏడాది కావొస్తున్నా.. నవ దంపతుల మాదిరిగానే కనిపిస్తారు. అయితే తన పెళ్లి గురించి తాజాగా ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నాకు పెళ్లి అయిందా అనే అనుమానం కలుగుతుంటుంది అని ప్రియాంక చెప్పింది. పెళ్లికి ముందు అనుభవాలను పూసగుచ్చినట్టు వెల్లడించారు.
లండన్‌లో నేను, నిక్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. మిలియనమ్ డోమ్ వద్ద మేము పరస్పర అంగీకారానికి వచ్చాం. ఇప్పుడు ఆ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో కీలకంగా మారిన ఆ ప్రదేశాన్ని ఇప్పటి వరకు వెళ్లి చూడలేదు. మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకొంటున్నాం అని ప్రియాంక చోప్రా చెప్పారు.

పెళ్లి చేసుకోవాలని అక్టోబర్‌లో డిసైడ్ అయ్యాం. డిసెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకోవాలని ముహూర్తం పెట్టుకొన్నాం. నెలన్నర ఉందిగా అని తాపీగా ఉంటే పెళ్లి రోజు రానే వచ్చింది. దాంతో మైగాడ్ అనే ఫీలింగ్ కలిగింది అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.
పెళ్లి తర్వాత జీవితం చాలా గమ్మత్తుగా మారిపోయింది. నిక్ జోనస్ చూస్తే బాయ్‌ఫ్రెండ్‌కి, భర్తకు తేడా కనిపించలేదు. నిక్ ఎప్పటిలానే సాధారణంగా ఉన్నాయి. ముందు నుంచే ఆ వ్యక్తి నా సొంతం. అతడే నా ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఉండటం వల్ల కొత్తగా అనిపించలేదు. పెళ్లి కొత్త బాధ్యతను పెంచింది.. జీవితానికి మరింత సేఫ్టిని అందించింది. ప్రతీ రోజు ఓ జీవిత పాఠం నేర్చుకొంటున్నాం అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ది స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో నటిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











