twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక రేటు వింటే షాకే.. నిమిషానికి కోటి అంటే.. తోక ముడిచారట..

    By Rajababu
    |

    Recommended Video

    ప్రియాంక రేటు వింటే షాకే..! | Filmibeat Telugu

    బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దేశీభామ ప్రియాంక చోప్రా దుమ్మురేపుతున్నది. అంతర్జాతీయ సినిమా రంగంలో ప్రియాంక గత రెండేళ్లుగా సత్తా చాటుతున్నది. హాలీవుడ్ రేంజ్‌లో హవా కొనసాగుతుండటంతో అమ్మాయి రేటు, డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయిందట. ఓ అవార్డు ఫంక్షన్‌లో ఐటమ్ సాంగ్స్‌పై డ్యాన్స్ చేయడానికి నిర్వాహకులు సంప్రదిస్తే దిమ్మ తిరిగే రేటు చెప్పడంతో అవాక్కయ్యారట. ఇంతకీ ఆ వివరాలు ఏమిటంటే

     హాట్ ఐటమ్ పాటలకు

    హాట్ ఐటమ్ పాటలకు

    2016లో ఆరంభంలో ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక చివరిసారి సారి స్టేజ్ మీద నర్తించింది. ఆ కార్యక్రమంలో హాట్ హాట్ ఐటమ్ పాటలకు చేసిన డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో జీ అవార్డుల నిర్వాహకులు ప్రియాంక కోసం ట్రై చేశారు.

     జీ సినీ అవార్డుల కోసం

    జీ సినీ అవార్డుల కోసం

    కాగా, జీ సినీ అవార్డుల కార్యక్రమం డిసెంబర్ చివరి వారంలో జరుగనున్నది. ప్రియాంకను పిలిచి డ్యాన్స్ చేపిస్తే అవార్డుల ఫంక్షన్‌కు క్రేజ్ వస్తుంది. రెండేళ్ల నుంచి ఏ షోలో కూడా డ్యాన్స్ చేయలేదు. అందుకే ప్రియాంక అయితే బాగుంటుంది అని అనుకొన్నాం అని అవార్డుల నిర్వాహకులు పేర్కొన్నారు.

     ప్రియాంక కోట్లు డిమాండ్

    ప్రియాంక కోట్లు డిమాండ్

    ఈ అవార్డుల ఫంక్షన్‌లో నర్తించడానికి ప్రియాంక 5 కోట్లు డిమాండ్ చేసిందట. ‘అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక ఫెర్ఫార్మెన్స్ కేవలం ఐదు నిమిషాలే. ప్రియాంక డిమాండ్ అలా ఉంది. అందుకే నిర్వాహకులు మరోమాటు మాట్లాడకుండా వెనక్కి వచ్చారు. నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేయడం బట్టి చూస్తే ఆమె క్రేజ్ ఏమిటో అర్థమవుతున్నది‘ అని షో నిర్వాహకుడు వెల్లడించారు.

     ఐఫా అవార్డుల్లో

    ఐఫా అవార్డుల్లో

    ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలోనే జరిగే ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఫెర్ఫార్మ్ చేయడానికి వారితో సంప్రదింపులు జరుపుతున్నది. అందుచేత కావాలనే ఆ రేంజ్‌లో డిమాండ్ చేసిందనే విషయం జీ నిర్వాహకులకు అర్ధమైందట. అందుకే మారుమాట మాట్లాడకుండా వచ్చేశామని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

     సల్మాన్‌కు మించి రెమ్యునరేషన్

    సల్మాన్‌కు మించి రెమ్యునరేషన్

    ప్రియాంక డిమాండ్ చేసిన మొత్తం కనీసం సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తీసుకోడట. సల్మాన్‌కు మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సినీ వర్గాలు కంగుతిన్నారు. ప్రియాంక రెమ్యునరేషన్ వివరాలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

    English summary
    Report suggest that Priyanka will be paid a staggering sum of around Rs 4-5 crore for a five-minute performance at the upcoming Zee Cine Awards. Priyanka's act will be about five-minute long. Since she is so much in demand, the organisers did not negotiate on the price her team quoted, despite it coming to almost a-crore-a-minute." source revealed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X