వైరల్ పిక్స్: రొమాంటిక్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటుడితో నడివీధిలో, పింక్ డ్రెస్సులో కేక
Recommended Video

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తన హవా కొనసాగిస్తోంది. హాలీవుడ్ లో సైతం పీసీ దుమ్మురేపుతోంది. క్వాంటికో సిరీస్ తో ప్రియాంక హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కేవలం నటనతోనే కాకుండా అందాల ఆరబోత విషయంలో కూడా ప్రియాంక హాలీవుడ్ లో దూకుడు ప్రదర్శితోంది. తాజాగా ప్రియాంక చోప్రా న్యూయార్క్ వీధుల్లో చిందులు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హాలీవుడ్ నటుడితో
ప్రముఖ హాలీవుడ్ నటుడు హేమ్స్ వర్త్ తో కలసి ప్రియాంక చోప్రా న్యూయార్క్ నడివీధిలో చిందులు వేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ డాన్స్ గ్రూప్ లో ప్రముఖ నటి రెబల్ విల్సన్ కూడా ఉండడం విశేషం.

సినిమాలో భాగంగానే
ప్రియాంక చోప్రా నది వీధిలో డాన్స్ చేయడానికి కారణం ఉంది. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగానే వారంతా డాన్స్ చేశారు. ఈజ్ నాట్ ఇట్ లవ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

యోగ అంబాసిడర్
ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో యోగా అంబాసిడర్ పాత్రలో నటిస్తోంది. ప్రేమ మీద నమ్మకం లేని ఓ యువతి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందట. ఈ చిత్రంలో కీలకమైన డాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి.

రొమాంటిక్ ప్రియాంక
పింక్ డ్రెస్ లో ప్రియాంక రొమాంటిక్ స్టిల్స్ యువతని పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. అందుకే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో ప్రియాంక ప్రేమ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











