Priyanka Chopra షూటింగ్‌లో తీవ్రంగా పడిన ప్రియాంక చోప్రా.. రక్తపు ధారలతో
గ్లోబల్ స్టార్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో ద్వారా వెల్లడించారు. ఈ ప్రమాద వివరాలకు సంబంధించిన విషయాల్లోకి వెళితే
ప్రియాంక చోప్రా తాజాగా ది బ్లఫ్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సందర్భంగా జరిగిన యాక్షన్ సీన్ షూటింగులో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాను. గొంతు, ముఖంపై గాయాల కావడంతో రక్త స్రావమూంది. బ్లఫ్ షూటింగ్ సమయంలో స్టంట్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని ప్రియాంక చోప్రా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు.

ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలు చాలా భయంకరంగా ఉన్నాయి. వీడియోలో ఆమె ముఖం నుంచి రక్తం కారుతుండటం కనిపించింది. ఆ వీడియో పోస్టు చేయగానే వైరల్ అయింది. అభిమానులందరూ ఏం జరిగిందంటూ ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలని విషెస్ అందజేశారు.
ఆ తర్వాత తన కూతురు మల్టీ మేరీ చోప్రా ఫోటోలను కూడా షేర్ చేసింది. మల్టీ సెట్స్‌లో ఆడుకొంటూ కనిపించింది. ఈ ఫోటోలు ఇన్స్‌టాలో వైరల్ అయ్యాయి.
ఇక ప్రియాం చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ అగైన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె జాన్ సీనా, ఐడ్రిస్ ఎల్బాతో కలిసి హెడ్ ఆఫ్ ది స్టేట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ది బ్లఫ్ చిత్రంలో ఫీమేల్ పైరేట్‌గా కనిపించబోతున్నది. ఈ పాత్రకు యాక్షన్ సీన్లు ఉండటంతో వాటి షూట్ సందర్భంగా ఆమె గాయపడింది.


Click it and Unblock the Notifications











