Citadel Trailer Review శృంగార సీన్లలో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా.. సిటాడెల్ ఓటీటీ రిలీజ్ ఎక్కడ? ఎప్పుడు?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్ జంటగా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్, స్పై థ్రిల్లర్, టెక్నో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ ద్వయం జోసెఫ్ రుస్సో, ఆంథోని రుస్ప్సో నిర్మాతలుగా వ్యవహరించారు. గోజీ ఏజీబీవో, మిడ్‌నైట్ రేడియో, అమెజాన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ తెలియజేస్తూ.. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్, రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సిటాడెల్ కథేంటంటే?
మాసన్ కానే (రిచర్డ్ మ్యాడెన్), నాదియా షా (ప్రియాంక చోప్రా జోనస్) టాప్ రహస్య గుఢాచారులు. వారిద్దరిని డబుల్ క్రాస్ చేసి.. వారిద్దరి జ్ఞాపకాలను తుడిచివేస్తారు. ఆ తర్వాత మాసన్, నాదియా ఏం చేస్తున్నారనే విషయంపై ప్రపంచం మొత్తం దృష్టిపెడుతుంది. తమ జ్ఞాపకాలను మరిచిపోయిన ఇదరు గూఢచారులు ఏం చేశారు? వారి ముందుకు వచ్చిన మిషన్‌ను ఎలా అమలు చేశారు అనే సిటాడెట్ కథ అనేది ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.

శృంగార సన్నివేశాల్లో ప్రియాంక
గూఢచారి నాదియా షా పాత్రలో ప్రియాంక చోప్రా మాట్ హాట్‌గా ట్రైలర్‌లో కనిపించింది. శృంగార సన్నివేశాల్లో గరం గరంగా కనిపించింది. బెడ్ రూమ్ సీన్లలో ప్రియాంక గ్లామర్ ట్రీట్‌ను ఇచ్చింది. ప్రియాంక చోప్రా, మ్యాడెన్ కెమిస్ట్రీ సిటాడెల్‌కు హైలెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి.

యాక్షన్ సీన్లలో అదరగొట్టిన ప్రియాంక
నాదియా పాత్రలో ప్రియాంక చోప్రా కేవలం శృంగారపరంగానే కాకుండా యాక్షన్ సీన్లలో కూడా తుంబ రేపిందనేది ట్రైలర్‌లో స్పష్టమైంది. ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రియాంక చోప్రా బాడీ లాంగ్వేజ్ అద్బుతంగా కనిపించింది.

ఏప్రిల్ 28వ తేదీన స్ట్రీమింగ్
సిటాడెల్ వెబ్ సిరీస్ పలు భాషల్లో రిలీజ్‌కు సిద్దం చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతున్నది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.
సిటడెల్‌లో తెర ముందు, తెరవెనుక
నటీనటులు: ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుసీ, లెస్లీ మాన్‌విల్లే, ఓసీ ఇఖిలే, ఆస్లీ కమ్మింగ్స్, రొనాల్డ్ మోలర్ తదితరులు
డైరెక్టర్స్: జోష్ అప్పేల్బామ్, బ్రాయన్ ఓ
నిర్మాతలు: ఆంథోని రుస్పో, జోసెఫ్ రుస్పో, మైక్ లారోకా
సినిమాటోగ్రఫి: న్యూటన్ థామస్ సీజెల్, మైఖేల్ ఉడ్
బ్యానర్: గోజీ ఏజీబీవో, మిడ్‌నైట్ రేడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-04-28


Click it and Unblock the Notifications











