తనకన్నా పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ స్టార్‌తో ప్రియాంక డేటింగ్.. ఎక్కడ చూసినా వాళ్లే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఈ భామ ప్రస్తుతం ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ. క్వాంటికో సిరీస్ ద్వారా హాలీవుడ్ లో పీసీ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ప్రియాంక చోప్రా అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ లో సైతం స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ప్రియాంక గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. ఓ హాలీవుడ్ యువకుడితో పీసీ ఘాటు ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

పాతికేళ్ల యువకుడితో డేటింగ్
క్వాంటికో సిరీస్ లో నటించిన తరువాత పీసీకి హాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఈ భామ డేటింగ్ లో ఉండనే వార్త సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పీసీ తనకన్న పదేళ్లు చిన్నవాడైన యువకుడితో డేటింగ్ చేస్తోందట. సింగర్ గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిక్ జోనస్ తో పీసీ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video


ఎక్కడా చూసినా ఈ జంటే
పీసీ ప్రస్తుత వయసు 35 ఏళ్ళు. ఆమె డేటింగ్ చేస్తున్న యువకుడు నిక్ జోనస్ వయసు 25 ఏళ్ళు కావడం విశేషం. ప్రస్తుతం ఈ జంట పబ్లిక్ గానే తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు.
స్టేడియంలో చెట్టాపట్టాలు
వీరిద్దరూ జంటగా లాస్ ఏంజల్స్ లోని బేస్ బాల్ స్టేడియంలోకి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో తోనే వీరిమధ్య ఏదో జరుగుతోందంటూ వార్తలు మొదలయ్యాయి.
హాలిడేలో ఎంజాయ్ చేస్తూ
పీసీ, నిక్ జోనస్ హాలిడే లో ఎంజాయ్ చేస్తూ కూడా కనిపించారు. నిక్ జోనస్, తన స్నేహితులతో కలసి హాలిడే వెళ్లగా అక్కడ కూడా పీసీ అతడితో చాలా క్లోజ్ గా ఉంది. దీనితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మొదటి సారి అలా
గత ఏడాది గాలా రెడ్ కార్పెట్ వద్ద తొలిసారి జంటగా మెరిశారు. ఆ సందర్భంగా వీరిద్దరో ఒకరోజు డేట్ కు వెళ్లారు. దీని గురించి పీసీకి టివి షోలో ప్రశ్న ఎదురవగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. తామిద్దరం ఒకే బ్రాండ్ దుస్తులు ధరించాం. అందుకే ఆరోజు డేట్ కి వెళ్ళాం. ఆ సమయంలో నేను నిక్ జోనస్ వయసు గురించి పట్టించుకోలేదు. నిక్ జోనస్ 11 ఏళ్ల పిల్లాడేం కాదుగా అంటూ బదులిచ్చింది.


Click it and Unblock the Notifications











