Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియాంక.. నీ పద్దతి బాగాలేదు.. పెళ్లికి ముందు షాకింగ్..
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం మీడియా పతాక శీర్షికల్లో హడావిడి చేస్తున్నది. అమెరికా ప్రియుడు నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ప్రియాంక వార్తలు అన్ని రకాల మీడియాల్లో వెల్లువెత్తుతున్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక చోప్రా తీసుకొంటున్న నిర్ణయాలు షాకింగ్ గురిచేస్తున్నాయి. పీసీ ఇస్తున్న షాకులేమింటంటే...
భారత్ నుంచి తప్పుకొన్న ప్రియాంక
నిక్ జోనస్‌తో ఎంగేజ్మెంట్ తర్వాత సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న భారత్ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. పీసీ తీసుకొన్న నిర్ణయంతో చేసేది ఏమీ లేకపోవడంతో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్.. వ్యక్తిగత జీవితంలో ఆమె సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను అని అన్నారు.
హాలీవుడ్ మూవీ నుంచి కూడా
ఇది ఇంకా మరిచిపోకముందే హాలీవుడ్ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మధ్యకాలంలో క్రిస్ ప్రాట్ అనే హీరోతో కౌబాయ్ నింజా వైకింగ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నది. ఆ చిత్రం నుంచి కూడా ప్రియాంక బయటకు రావడం షాకింగ్ గురిచేసింది. ప్రియాంక చేస్తున్న పనిని చూసి ఇది ఏమైనా పద్దతేనా అని నెటిజన్లు అంటున్నారు.
కౌబాయ్ నింజా వైకింగ్ సినిమా నుంచి
కౌబాయ్ నింజా వైకింగ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రియాంక తప్పుకోవడం యూనిట్ పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని 2019లో రీలీజ్ చేయాలన్న ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ చేస్తున్నారు. ప్రియాంక ఇచ్చిన షాక్‌తో సినిమాను నిలిపివేసినట్టు సమాచారం.
గందరగోళంలో హాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్
కౌబాయ్ నింజా చిత్రం నుంచి ప్రియాంక తప్పుకోవడంతో ఆ సినిమా భవిష్యత్ గందరగోళంలో పడింది. ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. డైరెక్టర్ మైకేల్ మ్యాక్ లారెన్ సందిగ్ధంలో పడిపోయారు. అయితే ప్రియాంకకు అనుకూలంగా ఉండే షెడ్యూల్‌ను ప్లాన్ చేసి రిలీజ్ డేట్ మార్చుకొనే ఉన్నట్టు తెలిసింది. ఎలాగైనా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను ప్రియాంకతోనే చేయించే ఉద్దేశంతో ఉన్నారు.