twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా మొగుడి కోరిక తీరేనా? నెక్ట్స్ ‘బ్యాట్ మెన్’ ఎవరు?

    |

    హాలీవుడ్ సూపర్ హీరో 'బ్యాట్ మెన్' సిరీస్‌ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బ్యాట్‌మెన్‌గా హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్స్ నటించారు. 2021లో రాబోయే తర్వాతి సిరీస్‌లో అఫ్లెక్స్ నటించడం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ డెడ్‌లైన్ బయటపెట్టింది.

    తర్వాతి బ్యాట్‌మెన్.. బెన్ ఫ్లెక్స్ కాదని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నా సైలెంటుగా ఉన్న అఫ్లెక్స్... డెడ్‌లైన్ మేగజైన్ ఈ మ్యాటర్ బ్రేక్ చేసిన తర్వాత స్పందించారు. ఈ సందర్బంగా దర్శకుడు మ్యాట్ రీవస్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.బ్యాట్‌మెన్ పాత్రను ఎవరితో రీప్లేస్ చేయాలి? అనే విషయంలో దర్శకుడు అన్వేషణ మొదలు పెట్టినట్లు సమాచారం.

    ప్రియాంక మొగుడికి బంపర్ ఆఫర్?

    ప్రియాంక మొగుడికి బంపర్ ఆఫర్?

    ‘బ్యాట్‌మెన్' మూవీలో బెన్ అఫ్లెక్స్ పాత్రను రీప్లేస్ చేసేది ఎవరు? అనే ప్రశ్నకు.... ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రియాంక మొగుడు నిక్ జోనస్ రియాక్ట్ అవుతూ.... ‘ఆ పాత్ర చేయబోయే వ్యక్తి ఫస్ట్ నేమ్ నిక్.. లాస్ట్ నేమ్ జొనస్' అంటూ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశం అయింది. అతడు ఈ ఆఫర్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    నిక్ జొనస్

    నిక్ జొనస్

    సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన నిక్ జోనస్...స్క్రీమ్ క్వీన్స్, జుమాంజి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడం ద్వారా యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టాడు. ‘బ్యాట్ మెన్' కావాలని ఆశ పడుతున్న నిక్ జోనస్‌కు ఆ అవకాశం దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

    బెన్ అఫ్లెక్స్

    బెన్ అఫ్లెక్స్

    బెన్ అఫ్లెక్స్ ఇప్పటి వరకు వచ్చిన 4 బ్యాట్ మెన్ సిరీస్ సినిమాల్లో బ్యూస్ వెయిన్/బ్యాట్ మెన్‌గా నటించాడు. బ్యాట్ మెన్ vs సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్, సూసైడ్ స్క్వాడ్, జస్టిన్ లీగ్ చిత్రాలకు క్రిటిక్స్ నుంచి అంతగా రియాక్షన్ ఏమీ లేక పోయినా... అఫ్లెక్స్ నటనకు ప్రశంసలు అందాయి.

    డిసి ఫిల్మ్

    డిసి ఫిల్మ్

    ‘బ్యాట్ మెన్' డిసి కామిక్స్ ఆధారంగా రూపొందించిన క్యారెక్టరే. డిసి సంస్థ నుంచి వచ్చిన ‘ఆక్వామెన్' ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. 7700 కోట్లు వసూలు చేసి... ఇంతకు ముందు ‘బ్యాట్ మెన్' పేరు మీద ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.

    English summary
    Ben Affleck on Thursday broke his silence regarding his future as the Dark Knight in a tweet, after months of speculation. Deadline broke the news that Warner Bros had slated the upcoming Batman movie for a July 2021 release, without Affleck. The actor tweeted his best wishes to director Matt Reeves, who is currently meeting with stars who could potentially play the role. In an Instagram post speculating who could replace Affleck as Batman, Jonas replied, “First name Nick. Last name Jonas.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X