పట్టపగలే పచ్చిగా రొమాన్స్.. ప్రియాంక చోప్రా, నిక్ వీడియో వైరల్
పెళ్లి తర్వాత కూడా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ప్రేమ పక్షులుగానే విహరిస్తున్నారు. తాజాగా ఇటలీలోని టస్కనీలో విహార యాత్ర చేస్తున్నారు. ఇటలీలో వీరిద్దరు చూస్తున్న సందడి మీడియాలో ప్రముఖంగా మారింది. ఇటలీ తరహాలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. స్వయంగా భర్తకు పాస్తా వండిపెట్టి వార్తల్లో నిలిచింది ప్రియాంక చోప్రా. అయితే టస్కనీలో ప్రియాంక, నిక్ చేస్తున్న రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్ోకి వెళితే..

ఇటలీ బాట పట్టిన ప్రియాంక, నిక్ జోనస్
తన సోదరుడి వివాహం తర్వాత ప్రియాంక, నిక్ జోనస్ దంపతులు ఇటలీ బాట పట్టారు. టస్కనీ లాంటి అందమైన ప్రదేశంలో ప్రేమను పంచుకొంటున్నారు. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా లవర్స్‌లా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విహార యాత్రలోని ఓ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
నిక్ రొమాంటిక్ వీడియోతో
టస్కనీలో ప్రియాంకతో చేసిన రొమాన్స్‌ను వీడియోగా చిత్రీకరించి నిక్ జోనస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటలీ సాయంత్రపు సూర్య కిరణాల కింద డీన్ మార్డిన్ ఆల్బమ్ వోల్టేరే పాటకు పచ్చిగా రొమాన్స్ చేశారు. వివిధ భంగిమలో ప్రియాంక ప్రేమను నిక్ జోనస్ ఆస్వాదించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు.

పెళ్లి తర్వాత లైఫ్ జాలీగా మారిందని
పెళ్లి తర్వాత జీవితం గురించి ప్రియాంక ఇటీవల షేర్ చేసుకొన్నది. వివాహం తర్వాత లైఫ్ చాలా గమ్మత్తుగా మారిపోయింది. నిక్ జోనస్ చూస్తే బాయ్‌ఫ్రెండ్‌కి, భర్తకు తేడా కనిపించలేదు. నిక్‌తో జీవితం ఎప్పటిలానే సాధారణంగా కనిపిస్తున్నది. నిక్ నా సొంతం అనే అభిప్రాయం ముందు నుంచే ఉండటమే కారణం కావొచ్చు. ళ్లి కొత్త బాధ్యతను పెంచింది.. జీవితానికి మరింత సేఫ్టిని అందించింది. ప్రతీ రోజు ఓ జీవిత పాఠం నేర్చుకొంటున్నాం అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.

కలుసుకొన్న చోటుకి వెళ్తామని
లండన్‌లో నేను, నిక్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. మిలియనమ్ డోమ్ వద్ద మేము పరస్పర అంగీకారానికి వచ్చాం. ఇప్పుడు ఆ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో కీలకంగా మారిన ఆ ప్రదేశాన్ని ఇప్పటి వరకు వెళ్లి చూడలేదు. మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకొంటున్నాం అని ప్రియాంక చోప్రా చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ది స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో నటిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











