twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Chopra భర్తతో కలిసి రొమాంటిక్‌గా.. నేను మరింత స్ట్రాంగ్ అంటూ!

    |

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ సినీ ప్రయాణం, తన కెరీర్‌లో ఫెయిల్యూర్స్ గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. హాలీవుడ్‌లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో తాను చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..

    లైఫ్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్

    లైఫ్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్

    నా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏదో గొప్పగా ఆశించి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాటికి గురించి ప్రస్తుతం ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తుంటాను. ఫెయిల్యూర్స్‌ గురించి ఆలోచిస్తూ నేను బాధపడే రకం మనిషిని కాదు అని ప్రియాంక చోప్రా చెప్పారు.

    వైఫల్యాలు రాటుదేల్చాయి

    వైఫల్యాలు రాటుదేల్చాయి

    గత ఏడాది కాలంలో నాకు ఎదురైన ఫెయిల్యూర్స్ నన్ను పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం నా వయసు 40 సంవత్సరాలు. నా జీవితంలో ఎదురుపడిన వైఫల్యాలు బాధిస్తుంటాయి. వాటి గురించి ఆలోచించినప్పుడల్లా నేను మానసికంగా దృఢంగా అవుతాను. నా ఫెయిల్యూర్ నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎప్పుడూ సౌకర్యంగా ఉండేలా నా కెరీర్‌ను నిర్మించుకొన్నాను అని ప్రియాంక చోప్రా అన్నారు.

    నా క్రెడిబిలిటిని పెంచే పాత్రలో

    నా క్రెడిబిలిటిని పెంచే పాత్రలో

    నేను హాలీవుడ్‌లోకి ప్రవేశించి పదేళ్లు దాటుతున్నా ఇంకా నన్ను కొత్త నటిగానే చూస్తారు. కానీ నా క్రెడిబిలిటి పెంచుకొనేలా నేను నా పాత్రలను ఎంచుకొంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రతీ సినిమాకు కోసం కష్టపడుతుంటాను. సినీ రంగంలోకి కొత్తగా వచ్చాననే ఫీలింగ్‌తో పనిచేస్తుంటాను. నా తోటి నటీనటులపై ఆపారమైన నమ్మకం, గౌరవంతో ఉంటాను అని ప్రియాంక చోప్రా చెప్పారు.

    గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా

    గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నేను ఏదో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అనుకొంటున్నాను. నేను ఎప్పుడూ ఒక లక్ష్యంతో పనిచేస్తుంటాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎదురయ్యే సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటాను. నేను ఇప్పటి వరకు గొప్ప ఫిల్మ్ మేకర్స్, నటులతో పని చేశాను. అది నాకు చాలా సంతృప్తిని కలిగించే విషయం అని ప్రియాంక చోప్రా అన్నారు.

    మెక్సికోలో భర్తతో కలిసి

    మెక్సికోలో భర్తతో కలిసి

    ప్రస్తుతం భర్త నిక్ జోనస్‌తో కలిసి మెక్సికోలో పర్యటిస్తున్నది. భర్త నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో భర్తతో కలిసి అందాల ఆరబోతతో అభిమానులను ఆకట్టుకొన్నది. మెకి్స్ సిటీ నైట్ నంబర్ 1 అని ఫోటో కింద క్యాప్షన్ పెట్టింది.

    ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

    ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

    ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. 2015లో క్వాంటికో అనే టెలివిజన్ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆమె బేవాచ్ లాంటి మూవీస్ నటించింది. ఇటీవల ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూసో బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్ చిత్రంతో ప్రియాంక అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ , జీ లే జరా చిత్రాల్లో నటిస్తున్నది.

    English summary
    Actress Priyanka Chopra touring in mexico with Nick Jonas, She shared a photo, in that she sizzles with Husband Nick Jonas ay Mexic City night 1 party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X