twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ టైమ్ బయటకు వచ్చాను.. ప్రియాంక పోస్ట్ వైరల్

    |

    ప్రపంచమంతా కరోనా వైరస్ గుప్పిట్లో బంధీ అయింది. కొన్ని లక్షల మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా అమెరికాలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించాయి. కరోనా దెబ్బకు అగ్ర రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. అయితే అక్కడ కరోనా అంతలా విజృంభిస్తున్నా.. లాక్ డౌన్‌లో మాత్రం సడలింపులు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ప్రియాంక చోప్రా అమెరికా నడి వీధుల్లోకి అడుగు పెట్టిందంటా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

    క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ విధించడంతో సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. ఎంతటి స్టార్ హీరోలైనా... గడపదాటి బయటకు రావడం లేదు. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇదే విధంగా ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్న ప్రియాంక చోప్రా మొట్టమొదటి సారిగా బయటకు వచ్చిందంట. బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి అమెరికాలోని లాస్ఎంజిల్స్‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెల‌ల సుధీర్ఘ విరామం అనంత‌రం బయటకు వచ్చానని ప్రియాంక తెలిపింది.

    Priyanka Chopra STeps Out In Quarantine After 2 Months

    మన కళ్లెప్పుడూ ఖాళీగా ఉండవు.. ఈ రెండు నెలల్లో మొదటి సారి అడుగు బయట పెట్టాను అని పోస్ట్ చేసింది. మాస్క్ ధరించిన ప్రియాంక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ విలువైన స‌మ‌యాన్ని ప్రియాంక చాలా తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటుంది. హిపాప్ డ్యాన్స్ నేర్చుకుంటూనే, తాజాగా పియానో కూడా నేర్చుకుంటుంది. స్వ‌యంగా ఆమె భ‌ర్త నిక్ త‌న‌కు పియానో నేర్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. త‌న‌కెంతో ఇష్ట‌మైన పియానోను త‌న‌కిష్ట‌మైన వ్య‌క్తి నుంచి నేర్చుకుంటున్న‌ట్లు పేర్కొంది.

    English summary
    Priyanka Chopra STeps Out In Quarantine After 2 Months. Eyes are never quiet. #FirstDayOutIn2Months Thanks for the masks avoyermagyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X