Artificial Intelligence హలీవుడ్‌లో భారీ సంక్షోభం.. 63 ఏళ్త తర్వాత సమ్మె.. ప్రియాంక చోప్రా మద్దతు

సినీ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelliegence) ముప్పుగా మారబోతుందా? సినీ రచయితలకు, సృజనాత్మక కళాకారుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభద్రతా భావాన్ని పెంపొందిస్తుందా? అనే విషయం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా సినిమా రంగంలోకి చొచ్చుకొని పోతున్న నేపథ్యంలో హాలీవుడ్ నటులు, రచయితలు సమ్మెకు పిలుపు ఇవ్వడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ సమ్మె వివరాల్లోకి వెళితే..

భవిష్యత్‌లో కళాకారులు, రచయితలు, సృజనాత్మక శక్తితో పనిచేసే వ్యక్తుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చోటు చేసుకోబోతుందనే అభద్రత మెల్లమెల్లగా హాలీవుడ్‌లో కనిపిసత్ున్నది. ఈ క్రమంలో కళాకారులకు, సినీ కార్మికులకు భద్రత కల్పించే విధంగా ఏఐ విషయంలో చట్టాలను, మార్గదర్శకాలను రూపొందించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Priyanka Chopra

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విషయంలో కార్మికులకు ఎలాంటి ముప్పు కలుగకుండా మార్గదర్శకాలను రూపొందించాలనే విషయంపై స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్ట్సిస్ట్ అధ్యక్షుడు ఫ్రాన్ డ్రెస్చర్ స్పందించారు. క్రియేటివ్ వర్కర్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుగా మారబోతున్నది. కళాకారులు సృజనాత్మక శక్తిని, జీతాలు చెల్లించకుండా శ్రమ దోపిడి చేయకుండా నివారించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

Priyanka Chopra

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ముప్పును అడ్డుకోకపోతే కళాకారులు, సాంకేతిక నిపుణులకు మనుగడ ఉండదు. ప్రపంచ సినిమానే ముపులో పడే అవకాశం ఉంది. మనుషుల స్థానంలో మెషిన్ల అధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ సినీ కార్మికులు ఐక్యమత్యంతో కలిసి పోరాడిల్సిన అవసరం ఉంది అని ఫ్రాన్ డ్రెస్చర్ తెలిపారు

Priyanka Chopra

హాలీవుడ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంక్షోభం కుదిపేస్తున్నది. గురువారం కొన్ని అసోసియేషన్స్ సమ్మెకు పిలుపు ఇవ్వడంతో హాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలువబోతున్నది. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్ట్సిస్ట్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు పిలుపు నివ్వడం సంచలనంగా మారింది.

హాలీవుడ్‌లో సమ్మె చేపట్టడం చాలా అరుదుగా కనిపిస్తున్నది. దాదాపు 63 ఏళ్ల తర్వాత ఇలాంటి సమ్మె రావడం, దానికి హాలీవుడ్‌లో అగ్ర నటులు మద్దతు తెలియజేయడం చర్చనీయాంశమైంది. ఈ సమ్మెకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా మద్దతు తెలియజేయడం గమనార్హం. ఈ సమ్మెకు ఏంజెలీనా జోలి, టామ్ క్రూజ్ లాంటి నటులు సపోర్టు తెలియజేశారు. దాంతో రానున్న రోజుల్లో భారీ బడ్జెట్ చిత్రాల విడుదల ఆగిపోయే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X