For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Matrix Resurrections review: ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? తొలి రోజు కలెక్షన్ల పరిస్థితి ఇలా?

  |

  గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మరోసారి హాలీవుడ్ తెరపై మెరువనున్నది. ఆమె నటించిన ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలో భారీగా రిలీజైంది. ఈ చిత్రంలో హలీవుడ్ తారలు కీను రీవెస్, జాడా పింకిత్ స్మిత్, క్యారీ ఆన్ మాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా సతి అనే పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం 18 ఏళ్ల క్రితం వచ్చిన ది మ్యాట్రిక్స్ రివల్యూషన్స్ అనే సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. అయితే ఈ సినిమాకు బలం, బలహీనతలు ఏమిటి? హాలీవుడ్‌లో ప్రియాంక హిట్ కొట్టబోతుందా అనే విషయంలోకి వెళితే..

  ది మ్యాట్రిక్స్‌కు సీక్వెల్‌గా

  ది మ్యాట్రిక్స్‌కు సీక్వెల్‌గా

  1999లో వచ్చిన ది మ్యాట్రిక్స్ చిత్రం హాలీవుడ్ తెరపై కల్ట్ మూవీగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నది. తాజా చిత్రం ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్ర కథ నియో (కీను రీవెస్) అనే హ్యాకర్ చుట్టూ తిరుగుతుంది. నియోతో ట్రినిటి (కారీ అననే మాస్)తో పోరాటం సినిమాకు హైలెట్‌గా మారిందనే విషయం స్పష్టమవుతున్నది. ఈ చిత్రంలో సతీ అనే కీలక పాత్రలో ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అతిథి పాత్ర అయినప్పటికీ.. కథను మలుపుతిప్పే పాత్ర అని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

  యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో

  యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో

  ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ సినిమాలో యాక్షన్ సీన్ల డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కీను, కారీ మాస్ మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ సినిమా కత్తికి రెండువైపుల పదను ఉన్న చిత్రంగా పేర్కొంటున్నారు. సాంకేతిక అంశాలే కాకుండా నటీనటులు పెర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  రెండేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా

  రెండేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా

  ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే రెండేళ్ల తర్వాత థియేటర్‌లో ఆమె సినిమా రిలీజైంది. దేశవ్యాప్తంగా ప్రియాంక చోప్రా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండటం కారణంగా దేశీయ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్‌లకు మంచి స్పందన కనిపించింది.

  ప్రేక్షకులు, సినీ విమర్శకులు స్పందన

  ప్రేక్షకులు, సినీ విమర్శకులు స్పందన

  అయితే ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మాట్రిక్స్ సినిమాలతో పోల్చితే.. వాటిని తలదన్నేలా లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఐఎమ్‌డీబీ లాంటి రేటింగ్ సంస్థలు కూడా సగటు రేటింగ్‌తో సరిపెట్టుకొన్నాయి.

  తొలి రోజు కలెక్షన్లు ఎలా అంటే..

  తొలి రోజు కలెక్షన్లు ఎలా అంటే..

  ఇక ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ తొలి రోజు కలెక్షన్ల అంచనా కూడా భారీగానే అంచనా వేస్తున్నారు. తొలి రోజున ఈ చిత్రం 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డార్లు వసూలు చేసే అవకాశం ఉంది. టోటల్ బాక్సాఫీస్ రన్ అంచనా మాత్రం 95 నుంచి 135 మిలియన్ డాలర్లు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం సుమారు 9.1 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కించారు.

  Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా ఇలా ఉంది.
  నటీనటులు: కీను రెవేస్, క్యారీ అనే మాస్, అబ్దుల్ మాటీన్, జెస్పీకా హెన్విక్, జోనాథన్ గ్రోఫ్, ప్రియాంక చోప్రా జోనస్, జాడా పింకెట్ స్మిత్ తదితరులు
  రచన, దర్శకత్వం: లానా వాచౌస్కి
  నిర్మాత: జేమ్స్ మెక్ టీగూ
  సినిమాటోగ్రఫి: డెనీలే మాసాసెసీ, జాన్ టోల్
  ఎడిటింగ్: జోసెఫ్ జెట్ సాలీ
  మ్యూజిక్: జానీ కిమెక్, టామ్ టైక్వేర్
  రిలీజ్ డేట్: 2021-12-22

  English summary
  Priyanka Chopra's comes to Theatres after 2 years with The Matrix Resurrections. In this occasion, Filmibeat Telugu review and day 1 estimated box office collections ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X