»   » హాలీవుడ్ అంటే అంతే... ప్రియాంక చోప్రా విలనిజం!

హాలీవుడ్ అంటే అంతే... ప్రియాంక చోప్రా విలనిజం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా తన సత్తా చాటిన ప్రియాంక చోప్రా....ప్రస్తుతం తన దృష్టంతా హాలీవుడ్లో ఎలా ఎదగాలనే దానిపై పెట్టింది. ఇప్పటికే అమెరికాలో ‘క్వాంటికో' అనే టీవీ యాక్షన్ సిరీస్ లో అవకాశం దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక....ఇపుడు ఏఖంగా హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

బజారుకెక్కిన ప్రియాంక(ఫోటో)

డ్వేన్ జాన్సన్(ది రాక్), కెల్లీ రోబచ్, అలెగ్జాండ్రా దడ్డారియో లీడ్ రోల్ చేస్తున్న బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించబోతోంది. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. ఈ చిత్రంలో తాను విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.

ప్రియాంక చోప్రా అదరగొట్టింది (కొత్త ట్రైలర్)

డ్వేన్ జాన్సన్ కూడా ప్రియాంకను పొగుడుతూ పోస్టు చేసారు. ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్లలో ఆమె ఒకరు...అత్యంత ప్రతిభావంతురాలు, చాలా డేంజరస్...బేవాచ్‌కు ఆమె పర్‌ఫెక్ట్. లేడీ విలన్ పాత్రలో ఆమె సినిమాకు చాలా ప్లస్సవుతుంది అంటూ రాక్ కామెంట్స్ చేసారు.

ఇండియన్ సినిమాల్లో ప్రియాంక చోప్రా ఇప్పటి వరకు హీరోయిన్ గా, ఐటం గర్ల్ గా మాత్రమే చేసింది. హాలీవుడ్లో మాత్రం విలన్ రోల్ చేయడానికి కూడా ఓప్పేసుకుంది.

స్లైడ్ షోలో ఫోటోస్....

బేవాచ్

బేవాచ్

బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా అవకాశం దక్కించుకుంది.

ఇదే తొలి చిత్రం

ఇదే తొలి చిత్రం

హాలీవుడ్లో ప్రియాంక చోప్రాకు ఇదే తొలి చిత్రం. ఇంతకు ముందు ఆమె అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో'లో నటించారు.

విలన్ రోల్...

విలన్ రోల్...


బేవాచ్ చిత్రంలో ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తోంది.

సూపర్ హాట్

సూపర్ హాట్

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా బికినీల్లో సూపర్ హాట్ గా కనిపించబోతోంది. అలాగే రొమాంటిక్ సీన్లు కూడా చేస్తోందట.

Read more about: priyanka chopra
English summary
Priyanka Chopra will play a negative role in Hollywood flick Baywatch that features Dwayne Johnson, Zac Efron, Kelly Rohrbach and Alexandra Daddario in lead roles. Priyanka, made an official announcement on social media, "And it's time to tell you all officially! Baywatch it is TheRock! Being bad is what I do best!!! You better watch out!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu