23 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నిర్మాతకు కరోనావైరస్..
హాలీవుడ్ మొఘల్ హార్వే వెయిన్‌స్టెయిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆదివారం నిర్వహించిన రోగ నిర్దారణ పరీక్షల్లో ఆయన కరోనా బారిన పడ్డట్టు నిర్ధారించారు. లైంగిక ఆరోపణలు, వేధింపులు, రేప్‌కేసుల్లో హర్వే వెయిన్‌స్టెయిన్ జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ కోర్టు ఆయనకు 23 ఏళ్ల జైలుశిక్ష విధించడంతో ఆయన నార్తర్న్ న్యూయార్క్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
గత బుధవారం బఫెలోకు సమీపంలోని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్‌కు హార్వేను తరలించారు. అంతకు ముందు ఆయనను ఖైదీలతో కిక్కిరిసిన రికర్స్ ఐలాండ్ జైలులో ఉంచారు. అక్కడ కొంతమందికి కరొనా లక్షణాలు బయటపడటం, ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయనను న్యూయార్క్‌లోని జైలుకు తరలించారు. గత ఫిబ్రవరిలో లైంగిక ఆరోపణల కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు హార్వే వెయిన్‌స్టెయిన్‌కు కఠిన శిక్షను విధించారు.

కాగా, నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ కరోనా బారిన పడ్డారనే మీడియా కథనాలను ఆయన వ్యక్తిగత సిబ్బంది ఖండించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని చెప్పారు.ఇప్పటి వరకు అమెరికాలో 417 మంది కరోనావైరస్‌తో మరణించారు. 33 వేల మందికి ఈ రోగ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.


Click it and Unblock the Notifications











