అవార్డుల ఫంక్షన్‌లో అల్లరి పాలైన చైనా సుందరి
చైనా రాజధాని బీజింగ్‌లో ఎస్క్వైర్ అవార్డుల కార్యక్రమంలో తెల్లని గౌన్ ధరించి అందంగా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోగ్రాప్స్‌కి ఫోజులిస్తూ రెడ్ కార్పెట్‌పై తన అందాలు హోయలోలికిస్తూ వస్తున్న రియాలిటీ టివి స్టార్ 'సన్ ఫైఫీ' గౌనుని ఆమె ప్రక్కనున్న మరో నటి ఫాంగ్ లింగ్ చూడక గౌనుపై కాలు వేసే సరికి ఆమె ధరించిన గౌను ఒక్కసారిగా ఊడిపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యచకితులైనారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే 'సన్ ఫైఫీ' గౌను ఊడిపోయిన సందర్బంలో తన గౌనుని సరిచేసుకోకుండా తన అందాలను అక్కడున్న వారికి చూపించడమే కాకుండా, కావాల్సినంత పబ్లిసిటీని కొట్టేసింది.
ఈ సందర్బంలో 'సన్ ఫైఫీ' ఒక్కసారిగా నిశ్చేష్టురాలై పోయింది. గౌను ఊడిపోయిన సందర్బంలో 'సన్ ఫైఫీ' తన శరీరంలో రంగులో ఉన్న బ్రాని ధరించడం జరిగింది. దాంతో ఫాంగ్ లింగ్ రియాలిటీ టివీ స్టార్ 'సన్ ఫైఫీ'కి సారీ చెప్పేలోపు అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. మా ఉద్దేశం ప్రకారం జరగాల్సిందంతా అంటే ఫోటోగ్రాప్స్ తీయడం అన్నమాట. ఐతే బీజింగ్‌లో ఉన్న లోకల్ ఇంగ్లీషు వెబ్ సైట్స్ మాత్రం 'సన్ ఫైఫీ' ఎందుకు ఈ పోరపాటు చేసిందో కారణాలు తెలిసుకోవాలని ప్రయత్నించగా, 'సన్ ఫైఫీ' ఇది కేవలం పోరపాటు వల్లనే జరిగిందని వివిరణ ఇచ్చారు.
ఐతే ఇలా రెడ్ కార్పెట్ మీద ఇలా జరగడం ఇదేం మొట్టమొదటి సారి మాత్రం కాదు. ఇలాంటి సంఘటనలు గతంలో రెండు, మూడు సంభవించాయి. బెర్లిన్ లో మార్నింగ్ గ్లోరీ సినిమా ప్రీమియర్ కోసం వచ్చిన సందర్బంలో హీరో హారిసన్ ఫోర్డ్ తన హీరోయిన్ రెచల్ మెక్‌ఆడమ్ ధరించిన రెడ్ డ్రస్సుపై ఇలానే కాలు పెట్టడం జరిగింది. ఇదే విధంగా హాలీవుడ్ పాపులర్ జంట బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలి ఇద్దరూ 'ద టూరిస్ట్' సినిమా ప్రమోషన్‌లో బ్రాడ్ పిట్ అనుకోకుండా జోలి ధరించిన తెల్లని గౌనుపై కాలు పెట్టాడు.


Click it and Unblock the Notifications











