twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లి తెరను మళ్లీ వేడెక్కించబోతున్న ప్రియాంక (టీజర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూనే అటు హాలీవుడ్ లోనూ వీరంగం చేసేస్తోంది ప్రియాంక చోప్రా. పాప్ క్వీన్ గా సంపాదించుకున్న పాపులారిటీతో అమెరికన్ టీవీ ఛానల్ లో క్వాంటికో పేరుతో రూపొందుతున్న టీవీ సీరిస్ లో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

    క్వాంటికోలో ఎఫ్‌బీఐ ట్రైనర్ గా కనిపించిన పీసీ... కిల్లర్ లుక్స్ తోనే కాదు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. స్టైలిష్ గా దర్శనమివ్వడంతో పాటు శృంగార సీన్స్ లోనూ భేష్ అనిపించుకుంది. ఎఫ్‌బీ‌ఐ ట్రైనీగా సత్తా చాటుకోవాలని పరితపించే యువతిగా క్వాంటికో సీరీస్ లో ప్రియాంక అదరగొట్టింది.

    Quantico Returns Official Teaser

    అనుకోని పరిస్థితుల్లో భారతీయ మూలాలు ఉన్న పిగ్గీచాప్స్ ఓ కేస్ లో ఇరుక్కుంటుంది... దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? తన నిజాయితినీ ఎలా నిరూపించుకుంది అనే పాయింటుతో ఈ సిరీస్ తెరకెక్కించారు. గతేడాది ప్రసారమైన 'క్వాంటికో' సిరీస్ సూపర్ హిట్టయింది. తాజాగా 'క్వాంటికో రిటర్న్స్' పేరుతో సీక్వెల్ రాబోతోంది.

    తాజాగా 'క్వాంటికో రిటర్న్స్' ప్రోమోను ఎబిసి ఛానల్ రిలజ్ చేసింది. ఇందులో ఆమె అలెక్స్ పారిష్ గా కనిపించబోతున్నారు. మాజీ ఎఫ్.బి.ఐ ట్రైనీగా ఆమె జర్నీ ఎలా సాగింది అనేది ఇందులో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. దీంతో పాటు 'బేవాచ్' అనే హాలీవుడ్ సినిమాలోనూ ప్రియాంక చోప్రా నటిస్తోంది.

    ఈ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ.. ''ఈ ఏడాది మార్చి నుంచి సీజన్ 1 మొదలవుతుంది. ప్రపంచంలోని వంద దేశాల్లో ప్రసారం కాబోతోంది. స్పానిష్‌, ఇటాలియన్, జర్మన్, ఆగ్నేయాసియాలోని వివిధ భాషలు.. మొత్తం 44 భాషల్లో అనువాదమైంది. అందుకే మొదట 13 ఎపిసోడ్లు చేద్దామనుకున్న ఈ సీజన్‌ను మరో 22 ఎపిసోడ్లకు పెంచాలని ఏబీసీ నిర్ణయించింది. నిజంగా ఇది చాలా పెద్ద షో'' అని ఆనందం వ్యక్తం చేసింది.

    ఇప్పటివరకు తన కెరీర్‌లో చేసిన ఛాలెంజింగ్‌ రోల్స్‌లో ఈ సీరియల్‌లో చేస్తున్న అలెక్స్‌ పారిష్‌ ఒకటని చెప్పింది ప్రియాంక. ''ఎందుకంటే నేను ఇండియన్-అమెరికన్‌‌ను కాదు, ఇండియన్‌ను. మరో దేశానికి వెళ్లి నా భుజాల మీద ఓ సీరియల్‌ను నెగ్గుకురావడం మాటలు కాదు. అమెరికన్ యాసతో మాట్లాడే భారతీయ వనితగా నటించాల్సి రావడంతో మొదట్లో ఈ కేరక్టర్‌ను ఎలా ఒప్పుకున్నానా అని భయపడ్డాను కూడా. తర్వాత వచ్చిన స్పందన నా కష్టాన్ని మరిపించింది'' అని చెప్పుకొచ్చింది.

    అరబ్ ఉగ్రవాది అన్నారు...
    దేహఛాయ కారణంగా తనని అరబ్‌ ఉగ్రవాది అన్నారని ప్రియాంక చెప్పింది. 88వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక ఈ విషయం తెలిపింది. 2013లో ఎన్‌ఎఫ్‌ఎల్‌(నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌) సమయంలో ప్రియాంక 'ఇన్‌ మై సిటీ' అనే థీమ్‌ పాట పాడింది. అప్పుడు కొందరు ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ 'ఎవరీ అరబ్‌ టెర్రరిస్ట్‌' అంటూ లీగ్‌కి మెయిల్స్‌ పంపారట. అది తెలియగానే అందరినీ బయటికి పిలిచి 'ప్రతీ అరబ్‌ వాసి టెర్రరిస్ట్‌ ఎందుకవుతాడు. నేను చామనఛాయలో ఉన్నాననేగా నన్ను టెర్రరిస్ట్‌ అంటున్నారు?' అని ఘాటుగా సమాధానమిచ్చానని చెప్పింది ప్రియాంక.

    English summary
    After mesmerizing the audience with her Oscar appreances, Priyanka Chopra is back to work with her series 'Quantico'. The bollywood actress turned US tv star is returning to the screens after the mid finale on Sunday, March 6.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X