twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె ప్రవర్తించే తీరు అధ్బుతం

    By Nageswara Rao
    |

    లండన్: ఆస్ట్రేలియన్ సింగర్ డాన్ని మినోగ్ బ్రటిన్ రాణిని 'ఫ్యాషన్ ఐకాన్' గా అభివర్ణించారు. డ్రస్సింగ్‌ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే మహిళ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్. ఆమె ఆ విధంగా డ్రస్సింగ్ చేసుకునేందుకు ఎన్నడూ బోరింగ్ ఫీల్ అయ్యానని తెలిపిన సందర్బమే లేదు. ఎన్నో సార్లు తాతమ్మ అయిన క్వీన్ ఎలిజబెత్ సందర్బాలను బట్టి డ్రస్సుని ధరించడమే కాకుండా.. తనకు ఏ కలరైతే ఖచ్చితంగా సరిపోతుందే అలాంటి కలర్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది.

    గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఎంతో మంచి ఫ్యాషన్ ఐకాన్‌లు వచ్చినప్పటికీ 86 సంవత్సరాల వయసు కలిగిన బ్రటిన్ క్వీన్ ఎలిజజెత్ కున్న ప్రత్యేకత వేరని అన్నారు. ఎప్పుడూ అందంగా కనిపించే విధంగా క్వీన్ ఎలిజబెత్ ప్రత్యేకమైన శ్రద్దను కనబరుస్తుందని అన్నారు. ఆమె ధరించే వార్డ్రోబ్‌లో ఓ అందమైన కార్యాచరణ యొక్క విజయం ఉంటుందని అన్నారు.

    ఈ విషయాలన్నింటినీ నేను 11 రోజుల పర్యటనలో భాగంగా క్వీన్ ఎలిజబెత్ 2011లో ఆస్టేలియాకి వచ్చిన సందర్బంలో గమనించానని తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ ఈ 11రోజుల పర్యటనలో ఎక్కువ భాగం ప్రజలతో సమావేశాలతో బిజీ బిజీగా గడిపారని తెలిపింది.

    ఇటీవలే క్వీన్ ఎలిజబెత్ మళ్లీ ఒక గొప్ప అమ్మమ్మగా మారింది - ఆమె మనవడు పీటర్ ఫిలిప్స్ మరియు అతని భార్య శిశిర ఫిలిప్స్ ఆడ శిశువుకి జన్మనిచ్చారు. బకింగ్ హామ్ ప్రతినిధి ప్రకారం ఆడ శిశువు గురువారం రోజు గ్లౌసెస్టర్షైర్ రాయల్ హాస్పిటల్‌లో జన్మించింది. ఇస్లా ఎలిజబెత్ ఫిలిప్స్ బరువు 7 పౌండ్లు మరియు 4 ఔన్సులు. ఆడ శిశువుకి జన్మనిచ్చిన మిస్టర్ పీటర్ ఫిలిప్స్ క్షమంగానే ఉందని తెలిపారు.

    సింగర్ డాన్ని మినోగ్ ఐదు నెలల ముందు ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తనబాబుకు ఈధన్ అనే పేరును పెడుతున్నట్లు కూడా పత్రికా ముఖంగా తెలియజేసింది. తను ప్రేమించి పెళ్శి చేసుకున్నటువంటి తన బాయ్ ప్రెండ్ క్రిస్ స్మిత్ ద్వారా తనకు సంతానం కలిగినట్లు తెలిపింది. అంతేకాకుండా తనకు బాబు జన్మించినందుకు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    English summary
    Australian singer Dannii Minogue says Britain’s Queen Elizabeth is a ‘fashion icon’ because she has never been boring in the way she dresses up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X