ఫ్రొజెన్‌లో ప్రత్యేక ఆకర్షణగా క్వీన్ ఇదునా.. లెఫ్టినెంట్ మాటియాస్

ఫ్రోజెన్ చిత్రంలో ఎల్సా, అన్నా పాత్రలు ఎంత బలమైనవో.. అదే మాదిరిగా వారి తల్లి క్వీన్ ఇదునా, తండ్రి కింగ్ అగ్నార్ రోల్స్‌ కూడా కీలకంగా కనిపించాయి. ఇక ఫ్రొజెన్ 2 చిత్రంలో వీరి పాత్రలు మరింత బలంగా కనిపించబోతున్నాయి. తన జీవితంలో దొరకని ఎన్నో ప్రశ్నలకు ఎల్సా సమాధానం వెతుక్కొనే ప్రయత్నంలో తల్లిదండ్రులు అండగా నిలిచే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయనే ట్రైలర్‌లో స్పష్టమయ్యాయి. ఇద్దరు అక్కాచెల్లెల్లు తమ అస్థిత్వాన్ని వెతుకులాడే క్రమంలో తల్లి పాడే ఆల్ ఈజ్ ఫౌండ్ అనే జోలపాట పలు ప్రశ్నలకు సమాధానం లభించేలా చేస్తుంది. జీవితంలో తారసపడే నది ప్రయాణం అన్ని సమాధానాలు చెబుతుందని పాట ద్వారా వివరిస్తుంది.

తన ఇద్దరు కూతుళ్లు ఎల్సా, అన్నా కూతుళ్లంటే క్వీన్‌ ఇదునాకు అమితమైన ప్రాణం. ఎన్ని కష్టాలు ఎదురైనా వారికి రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ప్రధానంగా ఎల్సా పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని గురించే కాకుండా.. ఆమెకు సంక్రమించిన అతీంద్రియ శక్తులు, జీవిత ప్రయాణంలో రేకెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా వ్యవహరిస్తుంది. తన కుటుంబం ఎదుర్కొనే సవాళ్లకు తన గత జీవితం సమాధానంగా నిలుస్తుందనే విషయం క్వీన్ ఇదునా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Queen Iduna and Lieutenant Mattias are special attraction for Frozen II

ఫ్రోజెన్ 2 టీజర్‌లో ఓ రకమైన శక్తులతో కూడిన అడవులు, వాయువేగాన్ని నియంత్రించే అదృశ్యశక్తి లాంటి అంశాలు కనిపిస్తాయి. కింగ్ అగ్నార్, క్వీన్ ఇదునా యవ్వనం గురించి అనేక విషయాలు ఆసక్తిగా ఉంటాయి. యవ్వనంలో కింగ్‌ అగ్నార్‌తో క్వీన్ ఇదునా ప్రేమలో పడే అంశాలు ఫీల్‌గుడ్‌గా కనిపిస్తాయి ఇలాంటి కీలకమైన క్వీన్ ఇదునా పాత్రకు వెస్ట్‌వరల్డ్ ఫేమ్ ఇవాన్ రాచెల్‌వుడ్ డబ్బింగ్ చెప్పడం విశేషమని చెప్పుకోవచ్చు.

ఇక ఫ్రోజెన్ 2 చిత్రంలో పరిచయం చేయబోయే కీలకమైన పాత్ర లెఫ్టినెంట్ మాటియాస్. అరెండెల్లే‌లో నిజాయితీతో కూడిన సైనికుడుగా కనిపిస్తాడు. అరెండెల్లే సామ్రాజ్యాన్ని కాపాడేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటూ.. శత్రువులకు బలమైన రక్షణ గోడగా నిలుస్తాడు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణంలో ఎల్సాను కలుసుకొని ఆమెలోని అతీంద్రియ శక్తులను గుర్తిస్తాడు. లెఫ్టినెంట్ డెస్టిన్ మాటియాస్ పాత్రకు స్టెర్లింగ్ బ్రౌన్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇక ఈ చిత్రం నవంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X