హీరోయిన్లను సెక్స్ కోసం వేధించింది నిజమే : నోరు విప్పిన దర్శకుడు
హార్వీ వెయిన్‌స్టన్ లైంగిక వేధింపుల గురించి అతడితో కలిసి పని చేసిన దర్వకుడు క్వింటెన్ టారంటినో స్పందించారు.అతడు హీరోయిన్ల పట్ల ప్రవర్తించే అనైతిక ప్రవర్త గురించి నాకు ముందే తెలుసని క్వింటెన్ ఒప్పుకున
దశాబ్దాల కాలంగా హాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ... టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎంతో కీర్తిగడించిన నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు మూడు దశాబ్దాలుగా హార్వీ వెయిన్‌స్టన్ లైంగిక వేధింపులు కొనసాగిస్తున్నా... పలు కారణాలతో వాటిని భరిస్తూ, బయటకు చెప్పకుండా మిన్నకుండి పోయిన ప్రముఖ హీరోయిన్లంతా ఇపుడు నోరు విప్పడంతో హార్వీ వెయిన్‌స్టన్ నిజ స్వరూపం బట్టబయలైంది.
ఏంజెలీనా జోలీ, గెనైత్ పాల్ట్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లు సైతం ఈ కామాంధుడి వేధింపులకు బలైనవారే. తాజాగా హార్వీతో కలిసి పని చేసిన ఓ దర్శకుడు కూడా మీడియా ముందు కొచ్చి వెయిన్‌స్టన్ అకృత్యాలను బయటపెట్టారు.

నాకు ముందే తెలుసు
హార్వీ వెయిన్‌స్టన్ చేస్తున్న ఇలాంటి నీచమైన పనుల గురించి తనకు ముందే తెలుసునని దర్శకుడు క్వింటెన్ టారంటినో తెలిపాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు షాకింగ్ ఈ విషయాలు వెల్లడించారు. `రిజర్వాయర్ డాగ్స్`, `పల్ప్ ఫిక్షన్`, `కిల్ బిల్`, `ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్`, `ద హేట్‌ఫుల్ ఎయిట్` చిత్రాలకు క్వింటెన్, హార్వీ కలిసి పని చేశారు.
అడ్డుకోకుండా తప్పు చేశాను
హార్వీ వెయిన్‌స్టన్ గురించి, అతడు హీరోయిన్ల పట్ల ప్రవర్తించే అనైతిక ప్రవర్త గురించి నాకు ముందే తెలుసు. అపుడు వాటిని అడ్డుకునే శక్తి నాకు ఉన్నా అడ్డుకోలేదు. ఇలాంటివి అన్నీ చాలా చిన్న విషయాలుగా తాను భావించినట్లు క్వింటెన్ తెలిపారు.

ఇంకా చాలా దారుణాలు చేశాడు
హార్వీ వెయిన్‌స్టన్ ఇంకా చాలా దారుణాలు చేశాడు. ఇలాంటి వ్యక్తి గురించి తాను బయటకు చెప్పుకుండా తప్పు చేశాను అని క్వింటెన్ టారంటినో విచారం వ్యక్తం చేశారు.

ఆ నటితో సెట్టిల్మెంట్ గురించి కూడా తెలుసు
ప్రముఖ హాలీవుడ్ నటి రోస్ మెక్‌గువాన్‌తో హార్వీకి జరిగిన సెటిల్‌మెంట్ విషయం కూడా తనకు తెలుసునని క్వింటెన్ ఒప్పుకున్నాడు.

ఆస్కార్ కమిటీ నుండి తొలగింపు
హార్వీ సెక్స్ స్కాండల్ వ్యవహారం చివరకు అతడిని మూవీ మొఘల్ స్థాయి నుండి చరిత్ర హీనుడిగా దిగజారేలా చేసింది. తాజాగా ఆస్కార్ అవార్డుల కమిటీ ( అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్ సైన్సెస్) మెంబర్‌షిప్ కూడా పోగొట్టుకున్నాడు. హామ్ హంక్స్, వూపి గోల్డ్‌బర్గ్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి దిగ్గజాలు ఉన్న 54 మందితో కూడిన ఆస్కార్ కమిటీ.... అతడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్ సైన్సెస్ చరిత్రలో..... బోర్డు సభ్యులచే వెలివేయబడ్డ రెండో వ్యక్తి హార్వే వెయిన్‌స్టెయిన్ కావడం గమనార్హం. వెయిన్‌స్టెయిన్ కంటే ముందు గాడ్ పాదర్ యాక్టర్ కార్మైన్ కారిడి కమిటీ నుండి తొలగించబడ్డారు.


Click it and Unblock the Notifications











