హాట్ హీరోయిన్‌కు కరోనావైరస్ కాటు.. ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడి

ప్రాణాంతక వ్యాధి నావెల్ కరోనావైరస్ బారిన పడిన సినీ ప్రముఖుల జాబితాలో రాచెల్ మ్యాథ్యూస్ చేరింది. జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఈ ముద్దుగుమ్మ వైద్య పరీక్షలు నిర్వహించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఇటీవల విడుదలైన ఫ్రొజెన్ 2 సినిమా ఈ హాలీవుడ్ ముద్దు గుమ్మ ప్రపంచ సినీ ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు, టామ్ హంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓగ్లా కురిలెంకో, ఇద్రీస్ ఎల్బా తదితరులు ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

నా అభిమానుల్లారా.. నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. గతవారమంతా ఇంట్లోనే బందీనయ్యాను. వైరస్ సోకడంతో ఇంకా ఏం చేయాలో తెలియడం లేదు. ఈ రోగ లక్షణాల నుంచి బయటపడేదాక ఇంటి నుంచి బయటకు రావొద్దని నిర్ణయించుకొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను. మీకేమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడిగి నిర్ధారణ చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మానసికంగా బలంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి అని రాచెల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంపింది.

Rachel Matthews tests Covid-19 positive

రాచెల్ మ్యాథ్యూస్ కెరీర్ విషయానికి వస్తే.. 2017లో హ్యాపీ డెత్ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రంలోనూ నటించింది. తాజాగా ఫ్రోజెన్ 2 సినిమాకు పనిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X