twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్ బాండ్ శత్రువుగా నటించనున్న ది మమ్మీ హీరోయిన్

    By Nageswara Rao
    |

    ది మమ్మీ సినిమాలో హీరోయిన్ రేచల్ వెయిజ్ మన అందరికి గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆసినిమా తెలుగు ప్రేక్షకులు కూడా అంతలా ఆదరించారు. మంచి మంచి హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి తజ్జుమా చేసి విడుదల చేస్తుంటారు. అలాగే ది మమ్మీ అనే సినిమాని కూడా గతంలో తెలుగులోకి తజ్జుమా చేసి విడుదలే చేశారు. అలా విడుదలయినటువంటి ది మమ్మీ సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. ది మమ్మీ సినిమాలో హీరోయిన్‌ గా అలరించినటువంటి రేచల్ వెయిజ్ మరోసారి మన ముందుకు జేమ్స్ బాండ్ సినిమాలలో విలన్ ప్రక్కన ఉండే స్పైగా మనల్ని అలరించనున్నారు.

    గతంలో కాసినో రాయ్, క్వాంటమ్ ఆప్ సోలెస్ చిత్రాలలో నటించినటువంటి డేనియల్ గ్రెగ్ తో మూడవ జేమ్స్ బాండ్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈసినిమాలో జేమ్స్ బాండ్ ప్రోడ్యూసర్స్ కొంచెం భయపడుతున్నారని సమాచారం. దీనికి కారణం సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాలలో జేమ్స్ బాండ్ విలన్ దగ్గర ఉన్నటువంటి స్పైతో రోమాన్స్ చేయడం, ఆతర్వాత రహాస్యాలు రాబట్టడం లాంటివి చాలా సినిమాలలో చూశాం. కానీ ఈరోమాన్స్‌కు రేచల్ వెయిజ్ ఒప్పుకుంటారో లేదో అన్న సందిగ్దత వారిలో నెలకోని ఉందని అభిప్రాయపడుతున్నారు.

    ఐతే ఈసినిమా క్రూకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం రేచల్ వెయిజ్, డేనియల్ గ్రెగ్ జంట చాలా బాగుంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈసినిమాలో అభిమానులకు రేచల్ ఇచ్చేటటువంటి ట్విస్ట్‌లు చాలా అధ్బుతంగా ఉంటాయన్నారు.

    English summary
    James Bond producers are reportedly keen to sign Rachel Weisz as the spy’s arch enemy in the upcoming Bond film. The Mummy star, 40 would be head of the sinister organisation behind the villainy in Casino Royale and Quantum of Solace rather than Bond''s love interest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X