twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినిమాలు ఒక్కసారే చూస్తాను: హ్యారీ పోట్టర్ హీరో

    By Nageswara Rao
    |

    హ్యారీ పోట్టర్ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, డబ్బుని సంపాదించుకున్న స్టార్ హీరో డేనియల్ రాడ్‌క్లిఫ్. సాధారణంగా హీరోలు ఎవరైనా ఖాళీ సమయం దొరికినప్పుడు వారి వారి సినిమాలను చూసేందుకు చాలా ఆసక్తిని చూపిస్తారు. కానీ తాను మాత్రం దీనికి పూర్తి విరుద్దం అంటున్నాడు డానియల్ రాడ్ క్లిఫ్.

    తాను హీరోగా నటించిన హ్యారీ పోట్టర్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్, బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసినప్పటికీ.. తాను కేవలం సినిమా ప్రీమియర్ స్కీనింగ్ లలో మాత్రమే చూస్తానని తెలిపాడు. తిరిగి మరలా ఆ సినిమాలు చూడనని ఖరాఖండిగా చెప్పాడు. మీరు గనుక హ్యారీ పోట్టర్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ ఐతే.. మీకు నచ్చినవి అన్ని చూసేయండని ఓ ప్రముఖ టివికి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

    నేను నటించిన సినిమాలు నాకోసం మరలా చూడడం నాకిష్టం ఉండదు. ఐతే చాలా మంది యాక్టర్స్ మాత్రం వారి సినిమాలు చూస్తారు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుదని చెప్పాడు. డేనియల్ రాడ్ క్లిఫ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ 'రోజీ కొకెర్' తో గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Actor Daniel Radcliffe says he has better things to do with his time than to watch himself in “Harry Potter” films. He has seen the “Harry Potter” movies at their premiere screenings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X