Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
నా గర్ల్ ప్రెండ్ బాగా సపోర్ట్ చేస్తుంది
హారీ పొట్టర్ సినిమాల ద్వారా హాలీవుడ్లో ఒక్కసారిగా స్టార్ డమ్ ఇమేజిని సొంతం చేసుకున్న హీరో 'డేనియల్ రాడ్ క్లిఫ్'. ఈ మద్య కాలంలో డేనియల్ రాడ్ క్లిఫ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ 'రోజీ కొకెర్' తో గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న విషయాన్ని వన్ ఇండియా పాఠకులకు గతంలోనే వివరించాం. ఐతే నిన్న 'ద ఉమెన్ ఇన్ బ్లాక్' వరల్డ్ ప్రీమియర్కి విచ్చేసిన డేనియల్ రాడ్ క్లిఫ్ మాట్లాడుతూ 'రోజీ కొకెర్' తనకి మంచి స్నేహితురాలుగా ఉండడమే కాకుండా తన మద్దతు ఎల్లప్పడూ నాకు ఉంటుందని అన్నారు.
వీటితో పాటు 'రోజీ కొకెర్' ప్రస్తావిస్తూ నా మెదడులో సగ భాగాన్ని తను ఇష్టపడితే.. మిగిలిన సగ భాగాన్ని తన అయిష్టాన్ని అభివర్ణించవచ్చు. ఆ విధంగా తను సంతోషాలను నాతో పంచుకుంటూ నన్ను ఎంతగానో ప్రొత్సహిస్తుందని అన్నాడు. నాకు ఏమేమి ఇష్టమో అవన్ని ముందుగానే తెలుసుకోని నాకోసం సిద్దం చేస్తుందని అన్నాడు. నా ఉద్యోగం అంటే 'రోజీ కొకెర్' ఎంతో ప్రేమ. నేను నా ఉద్యోగం చేయక పోతే ఏమీ ఉండదని తనకు తెలుసునని అన్నాడు.
డేనియల్ రాడ్ క్లిఫ్ నటించిన 'ద ఉమెన్ ఇన్ బ్లాక్' లండన్లో ఫిబ్రవరి 10న విడుదలవుతుండగా, అమెరికాలో ఫిబ్రవరి 3వ తారీఖున విడులవుతుంది.